పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ జగన్ నోటివెంట వెలువడిన భీషణ ప్రతిజ్ఞలు డొల్ల అని తేలిపోయింది. బెల్టు షాపులు పై ఉక్కు పాదం మోపామన్నజగన్ మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు గడప దాటలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బెల్టు షాపులు దందా సాగుతొందని చెప్పడానికి చెప్పడానికి గ్రామం,పట్టణ అనే తేడా లేకుండా గుడి,బడి కిరాణా,పాన్ షాపుల్లో ప్రతి చోట కనిపిస్తున్న బెల్టుషాపులే సాక్ష్యం. బెల్టు షాపుల నిర్వహణలో వైసిపి నాయకులు,కార్యకర్తలు,వైసిపి మద్దతు దారులదే కీలక పాత్ర.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 4,380 మద్యం షాపులున్నాయని,రెండు విడతల్లో వాటిని ప్రభుత్వం 2,934కు తగ్గించామని, అలాగే షాపుల్లోనే మద్యం తాగేందుకు వీలుగా ఉండే పర్మిట్ రూంలను తొలగించామని. దీంతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గి పోతాయని ప్రచారం చేసుకొన్నారు.కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. తగ్గిన షాపులకు బదులుగా ఊరూరా బెల్టులు వెలిశాయి.
మద్యం షాపులు తొలగించిన చోట్ల ప్రత్యామ్నాయంగా బెల్టు షాపులు వెలిశాయి. ప్రభుత్వం బెల్టుషాపులను వైసీపి కార్యకర్తలకు ఉపాధి షాపులు గా మార్చింది తప్ప బెల్టు షాపుల పై కఠిన వైఖరి ప్రదర్శించలేదు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బెల్టు షాపుల సంఖ్య పెరిగిందని మధ్య విమోచన కమిటీ మాజీ చైర్మన్ వి లక్ష్మణ్ రెడ్డి కూడా అన్నారు. బెల్టు షాపులు ఒక్కో గ్రామంలో ఏడు నుంచి 10 బెల్టు షాపులున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో బెల్టు షాపులు తుడిచి పెట్టేశామని జగన్ ప్రభుత్వం చెప్పుకొన్న గొప్పలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. ప్రభుత్వ బెల్టు షాపులకు ప్రభుత్వ దుకాణాల నుంచే వేర్వేరు మార్గాల్లో గ్రామాలకు తరలించి మద్యం విక్రయిస్తున్నట్లు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు.
అంతేకాదు రాష్ట్రంలోనాటు సారా ఉత్పత్తి, విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఇంటిలి జెన్స్ నివేదిక వెల్లడించింది.అధికార పార్టీ నేతల అండతోనే బెల్టు షాపుల దందా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బెల్టు షాపులు,నాటుసారా అమ్మకాలకు పాల్పడుతున్నవారిలో 90 శాతం మంది అధికార పార్టీ నాయకులే అని స్వయంగా ఇంటెలిజెన్స్ విభాగమే ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడైoది. గత ప్రభుత్వం మద్యం అమ్మకాలను పెంచాలని అధికారులకు లక్ష్యాలను విధించే వారని,ప్రతి మనిషిని ఎలా తాగుబోతులను చెయ్యాలనే ఆలోచనతోనే మద్యం అమ్మకాలను గ్రామ స్థాయికి వరకు తీసుకెళ్లారని,మేం అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్టు షాపు లేకుండా చేశామని, పాలనలో గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ప్రతి గ్రామంలో,ప్రతి వీధిలో బడి,గుడి పక్కన మద్యం బెల్టు షాపులున్నాయి.
ఫోన్ కొడితే మినరల్ వాటర్ వస్తుందో లేదో తెలియదు.కానీ మద్యం మాత్రం నేరుగా ఇంటికే వస్తుందని ఎద్దేవా చేసిన పెద్దమనిషి జగన్ తన పాలనలో వేల సంఖ్యలో వెలసిన బెల్టు షాపులకు ఎం సమాధానం చెబుతారు? మద్యం దుకాణాలు ప్రవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే లాభాల కోసం మద్యం విక్రయాలను పెంచుకోవడానికి బెల్టు షాపులు పెడతారని,అందుకే ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతుందని ,మేము అధికారంలోకి వచ్చాక బెల్టు షాపులు తొలగించామని జగన్ రెడ్డి చెప్పారు. ఇప్పడు జగన్ పాలనలో వేల సంఖ్యలోఊరారా వెలసిన బెల్టు షాపులకు ఎం సమాధానం చెబుతారు? మద్యపాన నిషేదం అమలు దేవుడెరుగు. వూరు వాడ వైసీపీ కార్య కర్తలు బెల్లు షాపులు విచ్చల విడిగా నిర్వహిస్తున్నా పట్టించుకొనే నాధుదే లేదు. జగన్ ధనదాహానికి పచ్చని సంసారాలు నాశనం అవుతున్నాయి,
మద్యనిషేధం హామీని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు వ్యవహరించి మద్యనిషేద హామీకి తూట్లు పొడిచారు. 2019-20 లో దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ 1,75 లక్షల కోట్లను ఆర్జించినట్లు సమాచారం. తర్వాత 2021-22 నాటికి అది 34 శాతం పెరిగింది.తెలంగాణలో ఆ పెరుగుదల 42 శాతం నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ అది ఏకంగా 110 శాతానికిఎగబాకింది.పైగా పధకాల కోసమే మద్యం అమ్మాల్సి వస్తుంది అంటూ మాది సంక్షేమ రాజ్య భావనే అని ప్రజలను ఘోరంగా పరిహసిస్తున్నారు.దశల వారీ మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మహిళలను దశల వారీగా దగా చేశారు.
దశల వారీ మద్య నిషేదం ఒట్టి వాగ్దానంగానే మిగిలిపోయింది.మద్యం ఆదాయమే ప్రభుత్వానికి దిక్కు అయింది. ఆదాయం కొరకు పేదల రక్తాన్ని కాసులుగా పిండుకొంటూ బూటకపు సంక్షేమంతో బురిడీ కొట్టిస్తు బడుగు జీవుల బలహీనతను సొమ్ము చేసుకొంటున్నారు.ఎన్నికలు ముందు మద్యాన్ని ఎరులై పారిస్తున్నారని గుండెలు బాదుకొన్న జగన్ అధికారంలోకి వచ్చాక జగన్ నాలుగు వంకర్లు తిరిగింది. మద్య పానంతో ఇబ్బంది పడుతున్న నా అక్క చెల్లెళ్ల కన్నీళ్లు తుడుస్తానని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ అవసరం తీరగానే మద్యాన్ని ఎరులై పారిస్తున్నారు. స్టార్ హోటళ్ళలో తప్ప మందు ఎక్కడా వుండదని వుదర గొట్టిన పెద్ద మనిషి ప్రస్తుతం తాగే మద్యాన్నే కాకుండా భవిష్యత్ లో తాగ బోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనుడు జగన్ రెడ్డి. కమీషన్ల కోసం కక్కుర్తి పడి కల్తీ మద్యం అమ్ముతూ మందు బాబుల ఆస్తులు, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని కల్తీ బ్రాండ్లు అమ్మడమే కాక, మద్యం అమ్మకాలపై టార్గెట్లు పెట్టి మరీ ఆదాయం పెంచుకుంటున్నారు తప్ప మద్యనిషేదం అమలుకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. మద్యపాన నిషేదం అమలు దేవుడెరుగు. వూరు వాడ వైసీపీ కార్య కర్తలు బెల్లు షాపులు విచ్చల విడిగా నిర్వహిస్తున్నా పట్టించుకొనే నాధుదే లేదు.అధికార పార్టీ నాయకుల వికృత వ్యాపారానికి, ధనదాహానికి పచ్చని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, పేద మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, మత్తు పధార్ధాల మాఫియా చెలరేగిపోతోంది. ఒకప్పుడు ముంబయి,ఢిల్లీ వంటి మహానగరాలకే పరిమితం అయిన ఈ జాడ్యo ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించింది.
డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏమి నెంబర్ వన్
డ్రగ్స్ స్మగ్లిoగ్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా నిలవడం సిగ్గు చేటు. దేశంలో 2021-22 సంవత్సరంలో డ్రగ్స్ ని అత్యధిక స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లోనే స్వాధీనం చేసుకొన్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ [డిఆర్ ఐ]పేరుతొ తయారుచేసిన నివేదికను కేంద్ర ఆర్ధికమంత్రి విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు [సి ఆర్పీ ఎఫ్]2021-22 ఏడాదిలో 18,267 కిలోలు నార్కోటిక్స్ స్వాధీనం చేసుకోవడం ఆందోళనకరం.డీ ఆర్ ఐ నేతృత్వంలో ఏపీ లో 1,057 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం,ఆన్ లైన్ లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటే జగన్ రెడ్డి పాలనలో పరిస్థితి ఎలా ఉందో అర్ధమౌతోంది.
మద్యం,మాదక ద్రవ్యాలు విక్రయం పెరిగి పోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై 4,340 అత్యాచారాలు జరిగాయని కేంద్ర హోం సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడించారు.అన్నిటిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వున్న గా నిలిచింది జగన్ పాలనలో.డ్రగ్స్ స్మగ్లిoగ్ లో నెంబర్ వన్- మద్యం అమ్మకాలలో నెంబర్ వన్,రైతు ఆత్మహత్యల్లో నెంబర్ వన్, మహిళల పై దాడులు,అఘాయిత్యాలలో నెంబర్ వన్,అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్, దేశ వ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదు అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 10 సీబీఐ కేసులు నమోదు అయినట్లు సమాచారం.సీబీఐ కేసుల్లోనూ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిపిన ఘనత జగన్ రెడ్డిదే.