జగన్ ఒక మాయల ఫకీర్, జగత్ కంత్రి, అవాస్తవ ఫేక్ వీడియోలతో జనాన్ని జగన్ మాయ చేస్తున్నారు. జగన్ రెడ్డి టక్కు, టమారా, గజ కర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలను తెలుసుకోవాల్సి వుంది. జగన్మాయలు, అబద్దాలను విపులంగా విశ్లేషించు కోవాలి ప్రజలు. జగన్ అబద్దాల, మాయల సుడిలో జనం కొట్టుకుపోతే మళ్లీ అగాధంలోకే. కావునా జగన్ అబద్దాల ప్రవాహానికి ఎదురు నిలిచి, అవగాహన పెంచు కుని, అన్ని విషయాలు ఆకళింపు చేసుకుంటే గానీ విషయం బోధపడదు. జగన్ అబద్దాల వైరస్ వేగంగా విస్తరిస్తుంది.
అసత్య ప్రచారాలతో రాష్ట్ర ప్రయోజనాలను,ప్రజల భవిష్యత్ ను బలిపెడుతూ, వ్యక్తుల,వ్యక్తిత్వాన్ని దిగజారుస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. జగన్ చేసే అబద్దాల ప్రచార ఫలితం భవిష్యత్ తరాల మీద బలంగా ఉండబోతోంది.కావునా ప్రజలు సత్వరం జాగ్రత్త వహించాల్సి ఉంది. అబద్దాన్ని అబద్ద మని విసుగు లేకుండా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి అబద్దాలను అడ్డుకోక పొతే భవిష్యత్తు అంధకారమౌతుంది. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి సామాన్య పౌరులు తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి. విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ప్రజల్లో మార్పు వస్తే తప్ప ఇటువంటి మాయలు,అబద్దాలు అడ్డుకోవడం సాధ్యపడదు. అధికార దాహంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వి నియోగం చేస్తూ ఏది నిజమో? ఏది అబద్ధమో తెలుసు కోలేనంతగా దిక్కుమాలిన ఫేక్ వీడియోలు తయారు చేసి వ్యక్తుల వ్యక్తిత్వాన్నిదెబ్బతీసేందుకు కుట్రలకు తెరతీసింది వైసిపి ప్రభుత్వం.
ప్రతిపక్షనేత చంద్రబాబును ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొవడం చేతకాక అధికారపార్టీ వైసిపి గ్రాఫిక్స్ మాయాజాలంతో,ఫెక్ వీడియోలతోబరితెగించి చంద్రబాబుపై కృత్రిమ దాడికి తెగబడింది. జగన్ రెడ్డి తిరిగి అధికారం లోకి రావడం కొరకు ఏ గడ్డి అయినా కరవడానికి సిద్దపడ్డారు. వేలాది మంది ప్రజలు పాల్గొన్న బహిరంగ సభల్లో చంద్రబాబు తన పార్టీని తానే బహిరంగంగా తిడుతున్న వీడియోలు తయారు చేసి జనంలోకి వదిలారు ఫెక్ పార్టీ నాయకులు . చంద్రబాబు తనను, తన పరిపాలనను బహిరంగ సభల్లో అడ్డగోలుగా తిట్టు కుంటున్నట్లుగా, అది నిజమే కదా అని ప్రజలు అంటున్నట్లుగా కొత్తరకం సాంకేతికతతో చంద్రబాబు పై దుర్మార్గమైన ప్రచారం మొదలు పెట్టింది జగన్ ప్రభుత్వం. గ్రాఫిక్స్ మాయాజాలం, కాపీ, పేస్ట్, ఎడిటిగ్ తెలియనివారు నిజమేనేమో అనుకునేంతగా ఆ దిక్కుమాలిన వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
ఈ మధ్య చంద్రబాబు బాదుడే బాదుడు బహిరంగ సభల్లో అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ పాలనలో విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, వాటిని భరించలేక ప్రజలు ఆర్ధికంగా చితికి పోయారా లేదా? అంటూ ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పాలనలో విద్యుత్, ఆర్టీసీ, నిత్యావసర ధరల పెరుగుదల లేదని, ప్రజలు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. కానీ వైసిపి సోషల్ మీడియా చంద్రబాబు పలుచోట్ల మాట్లాడిన మాటలను కట్ చేసి వాటి ఆధారంగా ఫేక్ వీడియోను తయారు చేసి, తెలుగుదేశం పాలనలో విద్యుత్, ఆర్టీసీ, నిత్యావసర ధరలు పెరిగాయని, ప్రజలు సర్వనాశయం అయ్యారంటూ చంద్రబాబే చెప్పినట్లుగా మాయ వీడియోను తయారుచేశారు. అంతేకాదు చంద్రబాబు బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్యగురించి ప్రస్తావిస్తూ వివేకాను హత్య చేసిందెవరు? బాబాయిని హత్య చేసిందెవరని? నేను కాదా? ఎవరు చేశారు? నేనే కదా? అంటూ చంద్రబాబే అంగీకరించినట్లుగా మరొక వీడియోను తయారుచేసి ఫేక్ వీడియోను ప్రజల్లోకి వదిలారు.
ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం
చంద్రబాబును దెబ్బతీసేలా ఫెక్ వీడియోలు తయారుచేసి అసత్యాలను సత్యాలుగా నమ్మించేందుకు పీకే టీమ్ వ్యూహ రచన చేసింది. సాంకేతికంగా అనుభవం ఉన్న ఈ టీమ్‌ను ఫేక్ వీడియోలు తయారు చేయడానికే వైసీపీ తెచ్చిపెట్టుకున్నది .సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఫేక్‌వీడియోలు తెరమీదకు తీసుకొచ్చి వివేకా హత్యకేసు విచారణను తప్పుదోవ పట్టించేలా వీడియోలు తయారు చేసి జనంలోకి వదులుతుండటం అత్యంత ఆందోళనకరం. ప్రజలకు మంచి పరిపాలన అందించి వారిని తమవైపుకీ తిప్పుకొని తమ వెంట నిలిచేలా ప్రజాస్వామిక విధానాలు అనుసరించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్దంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఫేక్‌వీడియోలు తెరమీదకు ప్రజలను మాయచేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు.
రాజకీయ పార్టీని స్థాపించి,పత్రికా రంగంలోకి జొరబడి తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడమే కాకుండా,ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తి పొయ్యడానికి, అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చెయ్యడానికి, ప్రత్యర్థుల పరువు ప్రతిష్టలు దిగజార్చడానికి మీడియాని ఒక ముసుగుగా వాడుకొంటున్నారు. జగన్ రెడ్డి చేసేది అంతా కుట్రపూరిత రాజకీయం. తన నీచ రాజకీయానికి రాజ్యాoగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను నిస్సిగ్గుగా అడ్డు పెట్టుకొంటున్నారు. పరిపూర్ణ ప్రజాస్వామ్య విలువలు పాటించాలన్న ఉద్దేశ్యంతో ఆనాడు పత్రికా రంగానికి అపరిమిత స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యానికి మూలస్థంభంగా భావించే మీడియాను తనకు ఊడిగం చేసేందుకు ఉపయోగించుకొంటున్నారు జగన్ రెడ్డి.
ప్రజాహితం లేకుండా దుర్భుద్ధితో మీడియాను ఏర్పాటు చేసుకొని అభాండాలు వెయ్యడం, బురదచల్లడం, అరాచకపు రాతలు రాయడం, నందిని పందిని చేస్తూ వికృత వీడియోలు తయారు చెయ్యడం, అబద్దాలు వండి వార్చడం జగన్ రోత మీడియా పని. తన పార్టీ ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలుగా భ్రమింప చెయ్యడానికి విశ్వప్రయత్నం చేస్తుంది జగన్ మీడియా. తన రాజకీయాలు నెరవేర్చుకోవడానికి సత్యా సత్యాలతో సంబంధంలేకుండా, విశాల ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా కుత్సితంగా,కుతంత్రంతో వ్యవహరిస్తోంది.ఇటువంటి మీడియా ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం. పచ్చిగా నిజా,నిజాలతో నిమిత్తం లేకుండా పాత్రికేయ,ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి తన అధికార దాహానికి మీడియాను దాసోహం చేశారు.
అడ్డ దారిలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మీడియాను సోపానంగా ఉపయోగించుకొంటున్నది జగన్ ప్రభుత్వం. ఫెక్ వీడియోలతో జగన్ సోషల్ మీడియా చేస్తున్నదురాగతాలకు అడ్డు,అదుపు లేకుండా పోయింది.అధికారాన్ని అడ్డంపెట్టుకొని అవినీతికి,కట్టుకధకు పుట్టిన విష పత్రికకు విషం చిమ్మడం తప్ప మరొకటి తెలియదు. ఈ ధోరణి అరికట్టక పొతే,ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు ఏర్పడనుంది. ఈ అడ్డమైన అబద్దాల వీడియోలను,అరాచక అడ్డగోలు రాతలను ఆపడానికి గానీ,పచ్చి అబద్దాలు ప్రచురిస్తున్నందుకు జైలు శిక్ష విధించడానికి గానీ ప్రెస్ కౌన్సిల్ కి ఎటువంటి అధికారాలు లేకపోడంతో మీడియా పేరుతొ జగన్ పార్టీ చేసే దురాగతాలకు అడ్డు లేకుండా పోయింది. దీనివల్ల జరుగుతున్న అనర్ధాల గురించి దెశ వ్యాప్తంగా చర్చగాల్సి వుంది. పత్రికా స్వేచ్ఛ స్వార్ధ శక్తుల చేతిలో ఒక ప్రమాద కర ఆయుధంగా మారింది.