పుట్టిన ప్రతి బిడ్డ చదువుల బడిలో ఎదిగేందుకు అమ్మ ఒడి శ్రీరామ రక్ష వంటిదని జగన్ పేర్కొన్నారు. చదువులలో విప్లవాత్మక మార్పులు తేవడానికి అమ్మ ఒడి దోహదమపడుతుందని అన్నారు జగన్. పేద తల్లిదండ్రులు స్కూలు ఫీజులు కట్టలేక, తమ పిల్లల్ని చదువులు మాన్పించిన పరిస్థితులు మారాలని జగన్ చెప్పుకొచ్చారు. చదువులలో విప్లమాత్మక మార్పులు తేవడానికే జగనన్న అమ్మ ఒడిని ప్రారంభించినట్టు జగన్ వివరించారు. నిరుడు సంవత్సరంలో 42 లక్షల మంది పిల్లలు లబ్ద పొందారని.. ఈ సంవత్సరం అక్షారాలా 44 లక్షల మంది పిల్లలు అమ్మ ఒడి ద్వారా చదువుల బడికి వెళ్లే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా జగన్ తెలియజేశారు.
అమ్మ ఒడి మొత్తంగా 44 లక్షల 48 వేల మంది తల్లుల ఖాతాల్లో జమ చేసినట్టు సిఎం తెలిపారు. రెండో విడత అమ్మ ఒడి కోసం రూ. 6773 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇకపై పిల్లలు బడికి రాకపోతే వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ విచారించే ఏర్పాట్లు చేసినట్లు జగన్ ప్రకటించారు. అన్నీ కులాలలోని పేద వారికి అమ్మ ఒడి అందుతుందని సిఎం పునరుద్ఘాటించారు.
9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులకు ప్రభుత్వం మరొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుండి 9-12 తరగతులు పిల్లల, తల్లులు డబ్బుకు బదులుగా ల్యాప్ టాప్ తీసుకునే సౌలభ్యాన్ని అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. ల్యాప్ టాప్కు మూడేళ్ల వ్యారంటీ కూడా అందించనున్నట్లు తెలియపరిచారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిఎం తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ రూపు రేఖల్లో మర్పు తేబోతున్నట్లు కూడా తెలిపారు. ప్రాధమిక విద్య అంగన్ వాడి నుండే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Must Read ;- విద్యార్థులకు జగన్ క్రిస్మస్ కానుక.. పీజీకి ఫీజులివ్వరంట
Also Read ;- అప్పులే ఆసరా, వడ్డీలు కట్టాలన్నా అప్పులే దిక్కు!