ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పుకు భయపడి వైఎస్ జగన్ తన కోటరీ ద్వారా మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. రాబోయే స్థానిక పోరులో ఓటమి ఖాయమని తేలిపోవడంతో, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడమే ఏకైక లక్ష్యంగా 3 కొత్త సాకులతో పిటిషన్లు వేసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను న్యాయపరమైన, పరిపాలనాపరమైన చిక్కుల్లో పడేసి, ప్రక్రియ మొత్తాన్ని స్తంభింపజేయాలని వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోంది.
వైఎస్ జగన్ ప్రత్యక్ష ఆదేశాలతోనే పంచాయతీ ఎన్నికల్లో BC రిజర్వేషన్లకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరిగాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించాల్సిన ప్రాతినిధ్యంపై అనవసర లీగల్ వివాదాలు, పరిపాలనా అడ్డంకులు రేకెత్తిస్తూ మొత్తం ఎన్నికల వ్యవస్థనే స్తంభించిపోయేలా చేస్తున్నారు. గ్రామాల్లో బీసీ వర్గాలు కూటమి వైపే స్పష్టంగా నిలబడటంతో, ఓటమి భయంతోనే జగన్ వర్గం ఈ రకమైన కుట్రపూరిత రాజకీయం చేస్తోంది.
ఈ గ్రామీణ ఎన్నికలను వాయిదా వేయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు విడుదల కావాల్సిన ఏకంగా రూ. 12,000 కోట్ల పే – కమిషన్ నిధులు, స్థానిక సంస్థల ఆర్థిక గ్రాంట్లను నిలిపివేయాలని చూస్తున్నారు. ఈ రూ. 12,000 కోట్ల నిధులు పంచాయతీలకు అందకపోతే గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్య పనుల అభివృద్ధి ఆగిపోతుందనేది వారి దుర్బుద్ధి.
ప్రజలకు లబ్ధి చేకూరితే తమ రాజకీయ ఉనికి తుడిచిపెట్టుకుపోతుందని భావించిన వైఎస్ జగన్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధిని, బీసీల రాజకీయ అభ్యున్నతిని తాకట్టు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. ఎన్ని న్యాయపరమైన చిక్కులు సృష్టించినా జగన్ కుట్రలను తిప్పికొట్టి, స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసి గ్రామీణ వ్యవస్థలను, బీసీల హక్కులను కాపాడటానికి కూటమి సర్కార్ సంపూర్ణ సిద్ధంగా ఉంది.











