కేంద్రం పెద్దల్లో ఆంధ్రప్రదేశ్ అన్నా, సీఎం జగన్ అన్నా ఇంతకు ముందున్న అభిప్రాయం లేదన్న విషయం స్పష్టమవుతోంది. మొన్నటి సీఎం జగన్ ఢిల్లీ టూర్ తర్వాత జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. చంద్రబాబును కుట్ర చేసి అరెస్ట్ చేయించిన జగన్ తన రాజకీయ వ్యూహంలో భాగంగా ముందస్తుకు వెళ్లాలన్న ప్లాన్ బెడిసికొట్టింది. బాబు జైల్లో ఉన్నప్పుడే ముందస్తుకు వెళ్లడం ద్వారా మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న జగన్ ఆలోచనకు కేంద్రం నుంచి తిరస్కరణ ఎదురైంది. ముదస్తుకు వెళ్లాలన్న ఆలోచన కూడా సరికాదని కేంద్రంలో బీజేపీ పెద్దలు జగన్ ప్రతిపాదనను తిరస్కరించారు. కేంద్రం ముందు తాను చెప్పిందల్లా జరుగుతుందనుకుంటున్న జగన్ ఈ ఊహించని పరిణామంతో బిత్తరపోయాడట.
పైగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలోనూ, ఆయనపై పెట్టిన కేసుల విషయంలోనూ దూకుడు తగ్గించాలని బీజేపీ పెద్దలు జగన్‌కు సూచించారట. అసలు కేంద్రం ప్రమేయమే కాదు, సమాచారం కూడా లేకుండా చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయించినట్టు అని ఒకరిద్దరు బీజేపీ మంత్రులు జగనపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఢిల్లీ టూర్ లో షాకుల మీద షాకులు తగులుతున్న జగన్.. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌కు మాత్రమే ప్రాధాన్యతనిచ్చారట.
మునుముందు ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అని ఊహించుకుంటూ ఢిల్లీ నుంచి తాడేపల్లి చేరిన జగన్ కు
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పంపిన నివేదిక సారాంశం తెలుసుకుని నివ్వెరపోయారని సమాచారం. వైసీపికి దగ్గరై తప్పు చేస్తున్నామని, చంద్రబాబుకు ఎన్నికల ముందు గ్రాఫ్ పెరిగిందని పురంధేశ్వరి ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన నివేదిక సారాంశం.
తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పెద్దలు మరింత ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.. చంద్రబాబు అరెస్ట్ అంశం తనకు తెలియదని, ఇదంతా కేంద్రంలోని బీజేపీ పెద్దల నాటకం అని కామెంట్ చేశారు ఏపీ సీఎం.. ఇదే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోందట.. బాబు అరెస్ట్‌ని కేవలం తన ప్రయోజనాల కోసమే చేసిన తాజాగా, ఆ అపవాదును తమపైకి రుద్దడానికి ప్రయత్నించడం జీర్ణించుకోలేకపోతున్నారట..
మరోవైపు, జగన్‌తో మారిన బీజేపీ వైఖరిని సైతం ఈ వ్యాఖ్యలు అర్ధం పడుతున్నాయని చెబుతున్నారు ఎనలిస్టులు.. హస్తిన బీజేపీ పెద్దలు వైసీపీతో పెరుగుతున్న దూరానికి ఇవి నిదర్శనం అని గుర్తు చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. మరి, త్వరలో ఈ అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి..