పాకిస్థాన్ తో జరిగిన మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. పాక్ ఆటగాడు అజార్ అలీని ఔట్ చేయడం ద్వారా 600 వికెట్ల క్లబ్ లో చేరాడు. సుదీర్ఘ టెస్టు చరిత్రలో ఇప్పటి వరకు ఏ పేసర్ కూడా 600 వికెట్లు తీయకపోవడం విశేషం. కెరీర్ లో ఇప్పటి వరకు 156 టెస్ట్ మ్యాచులు ఆడిన ఆండర్సన్ 26.79 ఏవరేజ్ తో ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా చూస్తే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా
——————————————————
1) ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)- 800 వికెట్లు
2) షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)- 708 వికెట్లు
3) అనిల్ కుంబ్లే (ఇండియా)- 619 వికెట్లు
4) ఆండర్సన్ (ఇంగ్లాండ్)- 600 వికెట్లు
5) మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా)- 563 వికెట్లు
6) వాల్ష్ (విండీస్)- 519 వికెట్లు
7) బ్రాడ్ (ఇంగ్లాండ్)- 514 వికెట్లు
8) స్టెయిన్ (సౌత్ ఆఫ్రికా)- 439 వికెట్లు
9) కపిల్ దేవ్ (ఇండియా)- 434 వికెట్లు
10) హెరాత్ (శ్రీలంక)- 433 వికెట్లు
సుదీర్ఘ కెరీర్ లో ఆండర్సన్ అత్యధిక సార్లు ఔట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో పీటర్ సిడిల్(11) ముందు వరుస లో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, మైఖేల్ క్లార్క్, అజార్ అలీ, డేవిడ్ వార్నర్ లను 9 సార్లు ఔట్ చేసి ఆండర్సన్ మరో రికార్డు తన పేరిట నెలకొల్పాడు.
2003లో కెరీర్ ఆరంభించిన ఆండర్సన్ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఈ దశలో తన స్వింగ్ బౌలింగ్ కు పదును పెట్టి తన సత్తా చాటాడు.
ఆండర్సన్ మైలురాళ్ళు
—————————————
మొదటి వికెట్- వెర్ములేన్(2003)
50వ వికెట్- ధోని (2007)
100వ వికెట్- కల్లిస్ (2008)
200వ వికెట్- సిడిల్(2010)
300వ వికెట్- ఫుల్టన్(2013)
400వ వికెట్- గుప్తిల్ (2015)
500వ వికెట్-బ్రాత్‌వైట్(2017)
600వ వికెట్- అజార్ అలీ(2020)
600 వికెట్లు తీసేందుకు తీసుకున్న బాల్స్ జాబితా ప్రకారం ఆండర్సన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మురళీధరన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
1) మురళీధరన్ (33711)
2) ఆండర్సన్ (33717)
3) వార్న్ (34919)
4) కుంబ్లే (38496)
తన కెరీర్ లో ఒక జట్టుఫై అత్యధిక వికెట్లు టీమిండియా(110)పై తీశాడు. స్వదేశంలోనే కాదు విదేశాలలో కూడా సత్తా చాటుతూ ఆండర్సన్ ఇంగ్లాండ్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.











