ప్రముఖ ఆంగ్ల చిత్ర నటీమణి, గ్లామర్ క్వీన్, జేమ్స్ బాండ్ మోడల్ మార్గరేట్ నోలన్ కన్నుమూశారు. ఆమెకు 76 సంవత్సరాలు. జేమ్స్ బాండ్ చిత్రం ‘గోల్డ్ ఫింగర్’ లో గోల్డ్ పెయింటెడ్ మోడల్ గా మంచి పేరు తెచ్చుకున్న నోలన్.. మరణ వార్తను ప్రముఖ దర్శకుడు ఎడ్గర్ రైట్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియపరిచారు.
రైట్ నోలన్ కు నివాళులర్పిస్తూ.. ‘నోలన్ అరవైల్లో ఆంగ్ల చిత్ర పరిశ్రమలో కేంద్ర బిందువుగా ఉండేది. క్యారియాన్ ఫ్రాంచైజీ మూవీస్ లోనూ, జేమ్స్ బాండ్ చిత్రాల్లోనూ ఆమె అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఆమెతో నేను చివరి సారిగా.. ‘లాస్ట్ నైట్ విత్ సోహో’ సినిమాకి పనిచేశాను’ అంటూ ఆవిడకి సంతాపం ప్రకటించారు. నోలన్ కి ఇద్దరు కొడుకులు. వారిలో ఆస్కార్ డీక్స్ ప్రముఖ దర్శకుడు కాగా.. ల్యూక్ ఓ సులివాన్ రెండో కొడుకు.
We are very sad to learn that Margaret Nolan has passed away at the age of 76. Margaret played Dink in Goldfinger (1964) and also appeared painted gold in the iconic opening credit sequence and on the Goldfinger poster. Our thoughts are with her family and friends. pic.twitter.com/aVIsqkGIxK
— James Bond (@007) October 12, 2020