తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ లో పార్టీ కార్యకర్త ఇంటిని చేరిన ఆయన వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తన గళం విప్పారు. మరో సారి తెలంగాణ రాష్ట్రం పై ఆసక్తి కర వ్యాఖ్యలుచేసి వార్తల్లో నిలిచారు. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన ఆయన తాజా గా ఉమ్మడి నల్లగొండ జిల్లా లో మాట్లాడిన తీరు చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ కీలకంకానుందని చెప్పకనే చెప్పారు. అందులో భాగంగా యువతనుద్దేశించి చేసిన వ్యాఖ్యాలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.రాష్ట్రానికి యువతరం ఆలోచనలు,ఆశయాలు అవసరమన్నారు. అందులో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగులు రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్ర సాధనలో యువత పాత్ర కీలకమన్నారు.వారి చేసిన త్యాగాన్ని వరువొద్దని తెలిపారు. అందులోభాగంగా యువరక్తం రాజకీయాల్లో కి రావాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థులు చేసిన త్యాగం కు తిరిగి చెల్లించే అవకాశం రాజకీయ రంగంలో కూడా ఉందని గుర్తు చేశారు.అందులో భాగంగా యువతరం రాజకీయాల్లో రావల్సిన అవసరం ఉందన్నారు..
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో పూర్తి గా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇంటో ఉద్యోగం ఎందరికి కల్పించారని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఎంత మందికి ఇచ్చారని నిలదీశారు?ఇందిరమ్మ ఇండ్లు అగ్గిపెట్టలవంటివన్నినాడు ఎద్దేవ చేసిన సీఎం కేసీఆర్ ఎంతమంది పేదల చిరకాల వాంచ తీర్చరా అని అన్నారు. ఉద్యోగాలు భార్తీ చేస్తామని ప్రకటన విడుదల చేసిన సీఎం కేసీఆర్ ఎప్పటికి భర్తి చేస్తారో తిలయదన్నారు?.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు బయలదేరిన పవన్ కళ్యాన్ అభిమాలను అలరించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మొదలు సిటీ దాటే వరకు అభిమాలనుకు అభివాదం చేస్తూ మురిపించారు. కొన్ని ప్రాంతాల్లో ఆగి అభిమానులు,కార్యకర్తలతో మాట్లాడారు..తమ అభిమాన సినీనటుడు రాజకీయ నేత ఆశ్చర్యకరంగా ఎదురవ్వడం తో సంతోషం పట్టలేకపోయారు.
. కోదాడలో గత ఏడాది ఆగస్టు 20న బక్కమంతులగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. వారికి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేశారు..