Janasena Leader Pawan Kalyan Welcomes YS Sharmila Party :
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి సందర్భంగా తెలుగు నేల రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో ప్రధానమైనదిగా భావిస్తున్న పరిణామం జనసేనాని పవన్ కల్యాణ్ నోట నుంచి వినిపించింది. వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణ వేదికగా వైఎస్సార్టీపీ పేరిట కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో షర్మిల మంచి విజయాలు సాధించాలని కోరుకునే శ్రేయోభిలాషులు ఎవరన్న విషయం ప్రస్తావనకు వస్తోంది. షర్మిల శ్రేయోభిలాషి జగనా? పవనా? అన్న చర్చకు ఇప్పుడు ఆన్సర్ కూడా వచ్చేసింది. షర్మిల పార్టీని ఆహ్వానిస్తున్నట్లుగా గురువారం ఉదయం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతంలో విజయవాడలో ఉన్న పవన్.. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
షర్మిల పార్టీ జగన్ కూ మంచిదేగా
తోడబుట్టిన చెల్లెలు పార్టీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. రాజకీయాల్లో ధీరుడినంటూ చెప్పుకునే జగన్.. షర్మిలను ఎంతగానో ప్రోత్సహించి ఉండాల్సింది. ఎందుకంటే.. ఏపీలో తనకు పోటీగా వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదన్న రీతిలో తెలంగాణ వేదికగా షర్మిల పార్టీ పెడుతుంటే జగన్ సంతోషించాల్సిందే కదా. అయితే ఎందుకనో గానీ.. షర్మిల పార్టీపై జగన్ ఇప్పటిదాకా స్పందించనే లేదు. అంతేకాకుండా తన అనుచరులతోనూ పెద్దగా షర్మిల పార్టీ గురించి మాట్లాడించనూ లేదు. మొత్తంగా రాజకీయంగా తన చెల్లి ఎదగాలని జగన్ కోరుకోవడం లేదా? అన్న అనుమానాలకు జగన్ తీరు ఆస్కారమిచ్చిందని చెప్పాలి.
షర్మిల పార్టీపై పీకే ఏమన్నారంటే..?
జగన్ తీరు ఇలా ఉంటే.. షర్మిల సొంత పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వైనాన్ని పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. *షర్మిల పార్టీని సాదరగంగా ఆహ్వానిస్తున్నా. ప్రజాస్వామ్యంలోకి మరిన్ని పార్టీలు రావాల్సి ఉంది. యువత మరింత మంది రాజకీయాల్లోకి రావడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. అందుకే నేను షర్మిల పార్టీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నా. షర్మిల లాంటి యువ నేతలు మరింత మంది యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలి* అని పవన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో జగన్ కంటే పవనే బెటరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఇద్దరి టార్గెట్ సేమ్.. గోల్ ఎవరికో..?