ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకే ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకూ కంటిన్యూస్ గా వసూళ్ళు కురిపిస్తోన్న జాతిరత్నం లాంటి సినిమా ‘జాతిరత్నాలు’. నవీన్ , రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిలాంటి న్యూజెన్ కమెడియన్స్.. నవ్వులు పంచిన ఈ సినిమా ఇప్పుడు ఓవర్ సీస్ ను కూడా చాలా ప్రభావింతం చేస్తోంది. ‘జాతిరత్నాలు’ సినిమా .. అమెరికాలో సంక్రాంతికి విడుదలైన తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా వసూళ్ళనే బ్రేక్ చేసి రికార్డు సృష్టించింది.
కేవలం నాలుగు రోజుల్లోనే వసూళ్ళల్లో మాస్టర్ సినిమానే మటాష్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ట్రేడ్ వర్గాల వారి రిపోర్ట్ ప్రకారం .. ‘జాతిరత్నాలు’ సినిమా 750కె వసూళ్ళని కురిపించిందట. కోవిడ్ టైమ్ లో కూడా ఈ తరహా వసూళ్ళు .. పైగా చిన్న సినిమా కు రావడం షాకింగ్ గా అనిపిస్తోంది. ఫుల్ రన్ లో కేవలం అమెరికా నుంచే 7 కోట్లు వసూళ్ళు రావడం ఖాయమని అంటున్నారు. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- అల్లు అర్జున్ మెచ్చిన ‘జాతిరత్నాలు’