డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసినవారికే నాయకుల కాలర్ పట్టుకుని పనులు అడిగే హక్కు ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి 35వ వార్డులో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటిస్తున్నసందర్భంగా అక్కడ ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఎన్నికల్లో వేలకు వేలిస్తే ఓట్లు వేశారని, పనులేమి చేయలేమంటూ వారిపై తనదైన శైలిలో జవాబిచ్చారు. దీంతో ఆ వార్డు ప్రజలందరూ అవాక్కయ్యారు. రాష్ట్రం మొత్తంలో తాడిపత్రి మున్సిపాలిటీలోనే టీడీపీ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.
Also Read:మున్సిపల్ ఛైర్మన్ అవ్వడానికి జగన్ హెల్ప్ చేశారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి