నెట్‌ఫ్లిక్స్ కోసం జెన్నిఫర్ లోపెజ్ మళ్లీ రంగంలోకి దిగుతోంది. ‘ది మదర్’ పేరుతో ఓ సిరీస్ చేయడానికి జెన్నిఫర్ అంగీకరించింది. ఇది యాక్షన్ కథాంశంతో రూపొందనుంది. జెన్నఫర్ ఇందులో నటించడమే కాకుండా దీనికి సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. డిస్నీ కోసం ములాన్ చేసిన నికి కారో దీనికి దర్శకత్వం వహిస్తారు. కథలోకి వెళితే ప్రమాదకరమైన పురుషుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోతుంది. అలా తన కూతురికి కూడా దూరమవుతుంది. తాను వదిలి వెళ్లిపోయిన కుమార్తెను రక్షించుకోడానికి వస్తుంది. దీనికి లవ్ క్రాఫ్ట్ కంట్రీ రచయిత మిషాగ్రీన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.
ఇందులో జెన్నిఫర్ లోపెజ్ తో పాటు ఎలైన్ గోల్డ్ స్మిత్ థామస్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తారు. నుయోరికాన్ ప్రొడక్షన్స్ దీన్ని నిర్మిస్తోంది. గ్రీన్, బెన్నీ మెడీనా, రాయ్ లీ తదితరులు నటిస్తున్నారు. జెన్నిఫర్ కు నెట్ ఫ్లిక్స్ తో ఇది మొదటి ఒప్పందం కాదు.. ఇంతకుముందు ఇసబెల్లా బల్డోనాడో నవల కోసం పనిచేసింది. అందులో ఎఫ్.బి.ఐ. ఏజంటు నీనా గురేరోగా నటించింది. జెన్నిఫర్ కు ‘ది మదర్’ మళ్లీ ఎలాంటి బ్రేక్ తెస్తుందో చూడాలి.
Must Read ;- ఓటీటీ బోల్డ్ కంటెంట్ కు ఇక గుడ్ బై!