శ్రద్ధ శ్రీనాథ్ పేరు వినగానే బాపు గీసిన బొమ్మ గుర్తుకు వస్తుంది. బృందావనంలో నుంచి తప్పిపోయి వచ్చిన అందాల గోపికలా కనిపిస్తుంది. ఆకాశాన్ని సంగం చేసినట్టుగా కనిపించే ఆ కళ్లు మత్తెక్కిస్తాయి .. కారు మేఘాన్ని విల్లుగా వంచినట్టు అనిపించే కనుబొమలు ఆ చూపులకి పైకప్పులా మారిపోయి ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక పొన్నాగిపూవులాంటి నాసిక .. పగడాలతో అల్లినట్టుగా అనిపించే పెదాలు ఆమె అందానికి మరింత వన్నెలు దిద్దుతుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్రాళ్ల గుండెలను కుంపటిలా మార్చే కుందనపు బొమ్మ ఆమె.
అలాంటి శ్రద్ధ శ్రీనాథ్ కి అందమే కాదండోయ్ .. కావలసినంత సమయస్ఫూర్తి కూడా ఉంది. వరుణ్ ధావన్ పెళ్లి సందర్బంగా ఆయనకి కంగ్రాట్స్ చెప్పే తీరులో ఆమె తనదైన సమయస్ఫూర్తిని కనబరిచింది. వరుణ్ ధావన్ కి ఆమె డిఫరెంట్ గా చెప్పిన విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మరో మంచి నటుడు పెళ్లి అనే ఊబిలోకి దిగిపోయాడు పాపం. ఇంతకుముందులా మనం ఆయనను స్క్రీన్ పై చూసే అవకాశం ఉండకపోవచ్చు. నటనలో భాగంగా ఆయన వేరే హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తే ఆయన భార్యతో పాటు అత్తింటివారు కూడా ఒప్పుకోకపోవచ్చునేమో. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హీరో ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తాడనిపిస్తోంది .. కంగ్రాట్స్ వరుణ్ ధావన్ ” అంటూ సెటైరికల్ గా అభినందనలు తెలియజేసింది.
Must Read ;- యాక్సిడెంట్ చేసిన పెళ్లికొడుకు వరుణ్ ధావన్.. ఏమైంది?
సాధారణంగా హీరోయిన్స్ కి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. పెళ్లి తరువాత సినిమాలు చేయవద్దని అనడం .. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం .. లేడీ ఓరియెంటెడ్ కథలను మాత్రమే చేయమని అనడం జరుగుతూ ఉంటుంది. అంటే వరుణ్ ధావన్ .. ఆడపిల్ల మాదిరిగా సున్నితంగా చూసుకోవలసిన హీరో అనే విషయాన్ని స్పష్టం చేస్తూ శ్రద్ధ శ్రీనాథ్ అలా చెప్పుకొచ్చింది. అతనితో ఆమెకి గల స్నేహానికి .. చనువుకు ఈ పోస్ట్ అద్దం పడుతోంది. అమ్మడికి అందమే కాదు .. అంతకి మించిన సమయస్ఫూర్తి ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ‘జెర్సీ‘ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ, ప్రస్తుతం ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమా చేస్తోంది.
Must Read ;- సన్నీ సిక్సర్.. ఇంగ్లాండ్తో సిరీస్ లో హాట్ బ్యూటీ!