టాప్ హీరోలు జూ.ఎన్టీఆర్, రాంచరణ్ లకు ప్రేక్షకలోకంలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. మొదటిసారి వారిద్దరూ కలసి నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‘ చిత్రంపై అంచనాలు ఎప్పటికప్పుడు మిన్నంటుతున్నాయి. అందునా రాజమౌళి దర్శకుడు కావడంతో ఆ అంచనాలకు ఇక హద్దేముంటుంది. ఇక ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న జూ.ఎన్ఠీఆర్ టీజర్ రామరాజు ఫర్ భీమ్ అక్టోబర్ 22న విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ టీజర్ కు యూట్యూబ్ లో 32 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
కాగా ఏకకాలంలో ఇదే టీజర్ ను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలలో ఆన్ లైన్లో విడుదల చేయగా…విశేషమైన స్పందన లభించడమే కాదు తాజాగా రికార్డును నెలకొల్పింది. ఆన్ లైన్లో 1. 1 మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు 2 లక్షలకు పై చిలుకు కామెంట్స్ వచ్చాయి. తెలుగు సినీ చరిత్రలోనే ఆన్ లైన్లో రికార్డు సృష్టించిన టీజర్ ఇదే కావడం గమనార్హం. ఇక రాంచరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలియంది కాదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి రాజమౌళి ఇంకా ఎలాంటి వండర్స్ విడుదల చేస్తారో చూడాలి.











