సినిమా హీరో అంటేనే బిజీ లైఫ్. షూటింగ్ లేకపోతే ఖాళీనే కదా అనుకుంటారు కొందరు. షూటింగ్ లేకపోయినా కథలు వినటం, తనను కలిసేందుకు వచ్చే వారితో మాట్లాడటంతోనే వారి టైమ్ సరిపోతుంది. అందుకే వారు ఫ్యామిలీకి సరిగా టైమ్ కేటాయించలేరు. కొంతమంది హీరోలు మాత్రం ఎంత బిజీగా ఉన్నా తమ కుటుంబ సభ్యుల ఆనందం పర్చేందుకు సమయం కేటాయిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్న రోజుల్లో ఏడాదికి ఆరేడు సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆయన తన పిల్లలు, తన సోదరుల పిల్లలతో గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓ ట్రిప్ వేసి వచ్చేస్తుంటారు కూడా. ఎన్టీఆర్ ఈమధ్య బయట బాగా తిరుగుతున్నారు. తాజాగా తన రెండో కొడుకు భార్గవ్ రామ్ తో బుల్లెట్ బైక్ పై రోడ్ ట్రిప్ వేయడం చర్చనీయాంశమైంది. బైక్ పై భార్గవ్ రామ్ ముందు కూర్చుంటే ఎన్టీఆర్ వెనక కూర్చుని కొడుకుని గట్టిగా పట్టుకున్నారు. బైక్ ను మాత్రం హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి నడుపుతున్నారు.
బైక్ పైనే పాస్‌పోర్ట్ ఆఫీసు వద్ద కనిపించారు. పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం అక్కడి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఫ్యాన్ నుంచి పెళ్లి ఆహ్వాన పత్రాన్ని అందుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇలా ఉన్నా ఎన్టీఆర్ అలా తిరగడం ఏమిటా అని జనం విస్తుబోతున్నారు. కరోనా కారణంగానే ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. అలాగే అభిమానులకు కూడా కొంత సమయం కేటాయించి కలుస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
Must Read ;- మహానట వారసత్వంలో మణిపూస ఎన్టీఆర్ @25