కడప కుర్రోడు.. చెన్నై జట్టులో అడుగుపెట్టాడు. ఐపిఎల్ 2021 టోర్నమెంట్‌కు జరిగిన వేలంలో కడపకు చెందిన ఓ యంగ్ క్రికెటర్.. చెన్నై జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కడప, రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఐపీఎల్ చెన్నై జట్లుకు ఎంపికయ్యాడు. 22 ఏళ్ల హరిశంకర్ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. వేలంలో ఇతని బేస్ ప్రైస్ 20 లక్షలుగా నిర్ణయించారు. ఆ ధరకు చెన్నై ఫ్రాంచైజీ అతణ్ణి దక్కించుకుంది.
LION ALERT! 🦁
From the land of #Bahubali we rope in Harishankar Reddy! #WhistlePodu #Yellove #SuperAuction 💛🦁— Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021
దీని గరించి చెన్నై ఐపిఎల్ ట్వీట్ ద్వారా తెలియజేసింది. ‘బాహుబలి నేల నుంచి హరిశంకర్ రెడ్డి మా జట్టులో చేరాడు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో క్రికెట్ దిగ్గజాలు ధోనీ, సురేష్ రైనా, ఫాప్ డుఫ్లెసిస్.. ఇలా ఎందరితోనో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు హరిశంకర్. మరి మనం కూడా మన సీమ కుర్రాడికి ఆల్ ద బెస్ట్ చెప్తాం రండి.
Must Read ;- ఐపీఎల్‌లో తొలిసారిగా సచిన్ తనయుడు.. ధరెంతో తెలుసా?
Everybody, let's give a yellove'ly welcome to Harishankar Reddy. #SuperFam #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/sLBTOSQkS5
— Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021











