జయాపజయాలతో సంబంధం లేకుండా.. కథానాయికగా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది కాజల్ అగర్వాల్ .. ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 లోనూ, చిరంజీవితో ఆచార్యలోనూ నటిస్తోన్న కాజల్ .. మరో పక్క మంచు విష్ణు తో ‘మోసగాళ్ళు’ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం సౌత్ లో అమ్మడి దూకుడు ఈ విధంగా ఉంటే.. ఆమె పెర్సనల్ లైఫ్ గురించి లేటెస్ట్ గా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
చందమామ త్వరలో పెళ్ళిపీటలెక్కబోతోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుడు ముంబై కి చెందిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు తో కాజల్ అతి త్వరలో మూడు ముళ్ళు వేయించుకోనుందట. ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌతమ్ తో ఇటీవలే ఆమె నిశ్చితార్ధం జరిగిందని వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో గౌతమ్ ఏమంత యాక్టివ్ గా ఉండని కారణంగా అతడు ఎలా ఉంటాడో నెటిజెన్స్ కు అంతగా తెలియదు. కానీ ఎలా అయితేనేం.. అతడి ఫోటో ఇప్పుడు బైటికి వచ్చింది. ఇరువురి కుటుంబ పెద్దలూ ఈ విషయంలో సముఖంగా ఉన్నారని సమాచారం. మరి చందమామ పెళ్ళి ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూడాలి.