ఓటీటీ అంటేనే బోల్డ్ అని ఫిక్స్ అయిపోయినట్టుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నాయని అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై కర్చీఫ్ వేయడం సర్వసాధారణం. చాలా మంది తారలకు ఓటీటీ వరప్రసాదంగా మారింది. సినిమాల్లో ఫలానా సన్నివేశం అంటే నస పెట్టేవారు ఓటీటీకి వచ్చే సరికి అలాంటి నిబంధనలు ఏమీ పెట్టుకోవడం లేదు. అందుకు తాజా ఉదాహరణ కాజల్ అగర్వాల్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వెబ్ సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’లో ఆమె నటించిన సంగతి తెలిసిందే.
ఇది హారర్ వెబ్ సిరీస్. దీని స్ట్రీమింగ్ ఈనెల 12 నుంచే ప్రారంభమైంది. ఇందులో ఆమె మాటలు, ఆమె చేష్టలు చూసి అందరూ ఔరా అంటున్న ముక్కున వేలేసుకున్నారు. సిగెరెట్ దమ్ముతో దుమ్ము రేగ కొట్టడమే కాదు బూతు మాటల్లోనూ తానేమిటో నిరూపించుకుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ ను ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువదించారు. ఇప్పటిదాకా సినిమాల్లో ఆమె పాత్రలు చూసిన జనానికి ఇందులోని పాత్ర మింగుడు పడటం లేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో వైభవ్, ఆనంది ఇతర పాత్రలను పోషించారు.
కాజల్ పాత్ర విషయానికి వస్తే రెచ్చిపోయి మరీ నటించింది అనే చెప్పాలి. ఆమె ఏ ముహూర్తాన ఓటీటీలో అడుగుపెట్టిందోగాని ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడానికి మరిన్ని అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. తెలుగు దర్శకుడు మారుతి రూపొందించే ఓ వెబ్ సిరీస్ కు కూడా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. తొలి వెబ్ సిరీస్ తోనే అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేసేసింది. ఇందులో ఆమె దూకుడు ఇంకెలా ఉండబోతుందో మున్ముందు చూడాలి.
Must Read ;- అందాల చందమామకి హెల్త్ ప్రాబ్లమా?











