(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పోలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావును పోలీసులు రాజాంలోని తన స్వగృహంలో మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు బయలు దేరిన కళా వెంకట్రావును పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కొద్దిసేపటి క్రితమే రాజాంలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు.. హౌజ్ అరెస్టుకు సంబంధించిన నోటీసులు అందించారు. ఇంటి నుంచి బయటకు రావొద్దని చెప్పారు. పోలీసుల వైఖరిపై కళా వెంకట్ రావు తీవ్రంగా ఆగ్రహించారు. అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరించారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు అచ్చెన్నాయుడు అరెస్టు చేశారు. ఆయన్ను కోట బొమ్మాలి పీఎస్కు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం కోర్టుకు తరలించారు.
Must Read ;- అచ్చెన్న అరెస్టుతో సిక్కోలులో ఉద్రిక్తత..