తాత ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ ఓ చారిత్రక సినిమాని ప్రకటించారు. ఆ సినిమా పేరు ‘బింబిసార’. ఓ బార్బేరియన్ రాజు జీవితాన్ని సినిమాగా ఎంచుకోవడం విశేషం. ఆది ‘ఆదిత్య 369’, ‘మగధీర’ తరహాలో సాగుతుందని హింట్ కూడా ఇచ్చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా విశేషాల వీడియోని విడుదల చేశారు.
ఇందులో కళ్యాణ్ రామ్ పాత్ర ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. చెడు నుంచి మంచి వైపు కాలంతో సాగే ప్రయాణంలా దీన్ని అభివర్ణించారు. దీనికి వశిష్ఠ్ దర్శకుడు. ఈ కథ గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం 543లోకి వెళ్లాల్సిందే. 15 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు బింబిసారుడు.మగధ రాజ్యానికి పునాదులు వేసింది ఆయనే. అదే ఆ తర్వాత పాటలీ పుత్రంగా మారింది.
మగధ రాజ్య సింహాసనాన్ని అధిరోహించడానికి ఆయన కుమారుడు అజాతశత్రు ఆయనను ఖైదు చేస్తాడు. అజాతశత్రు తన మొదటి బిడ్డ పుట్టిన తర్వాత తండ్రిని విడుదలకు ఆదేశిస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం జరిగి బింబిసారుడు మరణిస్తాడు. బింబిసారుడి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఈ చిత్రం నిర్మిస్తున్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి నందమూరి వంశం నుంచి మరో చారిత్రక కథాంశంతో సినిమా రాబోతోంది.
Must Read ;- ‘పుట్టుక నాది, చావు నాది, బతుకంతా టీడీపీదే’ : పింఛన్ తో పార్టీ గుర్తులు, ఎన్టీఆర్ బొమ్మల తయారీ!











