బాలీవుడ్ లో లేడీ ఫైర్ బ్రాండ్ అంటే వెంటనే గుర్తొచ్చే నటి కంగనా రనౌత్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో న్యూస్ లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఈ బ్యూటీ. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ గా కనియించే ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలను తాగేట్ చేసినట్లు కనిపిస్తోంది.ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో వారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
బాలీవుడ్ స్టార్లకు తానంటే భయమని.. అందుకే ఎవరూ తనతో నటించేందుకు ఇష్టపడరని చెప్పింది.అంతేకాకుండా తనతో పని చేసిన వారిని కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు టార్గెట్ చేస్తారంటూ కంగనా రనౌత్ మండిపడింది. తనతో నటిస్తే ఇబ్బందులు ఎదురావుతాయని తెలిసి కూడా అర్జున్ రాంపాల్ తనతో నటించారని, నిజంగా గ్రేట్ అంటూ ఆయనకు కితాబునిచ్చింది.
అదేసమయంలో బీ టౌన్ సెలబ్రిటీలపై ఈ ఫైర్ బ్రాండ్ తీవ్రంగా ఫైర్ అయ్యింది.ఏ బాలీవుడ్ స్టార్ కు కానీ, బీటౌన్ సెలబ్రిటీలకి కానీ తన ఇంటికి వచ్చే అర్హత లేదని కంగన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వారెవరైనా తనను బయట కలిస్తే పర్వాలేదు కానీ, తాను మాత్రం అస్సలు వారిని తన ఇంటికి ఆహ్వానించనని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే కంగన తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్’ ఈ నెల 20న విడుదల కాబోతోంది.కాగా, ఈ చిత్రంలో ఆమె స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని రీతిలో యాక్షన్ సీన్లలో నటించిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కంగనా తన సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, ప్రస్తుతం కంగన చేసిన వ్యాఖ్యలు బీటౌన్ లో చర్చనీయాంశంగా మారాయి.