Kangana Ranaut Visits Jayalalita Ghat :
జయలలిత బయోపిక్ గా ‘తలైవి’ చిత్రంలో ఎలాంటి వివాదాస్పద అంశాలు ఉంటాయన్నదానిపైన ఆసక్తి నెలకొంది. సాధారణం ఎవరి బయోపిక్ తీసినా అందులో వివాదాస్పద అంశాలు లేకపోతే దాని మీద ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో వివాదాస్పద అంశాలు చాలానే ఉన్నాయి. జీవితంలో మెలోడ్రామా ఉండాలి. వాటిని తెరమీద చూపగలగాలి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అలా జరగలేదు. వివాదాస్పద అంశాల జోలికి పోకుండా సినిమా చేసి హిట్ కొట్టడం మాటలు కాదు. పైగా జయలలిత జీవితంలో వివాదాస్పద అంశాలు చాలానే ఉన్నాయి.
తలైవిలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషించింది. నిజజీవితంలో కంగన అంటేనే వివాదాల మయం. అలాంటి కంగన పోషించిన పాత్రలో వివాదాలు లేకపోతే ఎలా? సినిమాల్లో నటిస్తుండగా ఆమె ప్రేమ వ్యవహారాలు, ఎంజీఆర్ జీవితలోకి వచ్చాక జరిగిన పరిణామాలు, కేసులు, శశికళ, ఆమెకు సంతానం ఉందా లేదా? లాంటి వివాదాస్పద అంశాలెన్నో జయ జీవితంలో ఉన్నాయి. అసలు ఆమె మరణించిన తీరే పెద్ద వివాదం. వీటిలో కొన్ని అంశాలనైనా టచ్ చేయకపోతే సినిమా రక్తికట్టదు.
ఈ నెల 16 ఈ సినిమా విడుదలవుతోంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంకా భాగ్యశ్రీ, అరవిందస్వామి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలను పోషించారు. విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్, బ్రిందా ప్రసాద్ దీన్ని తెలుగులో అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఏఐఏడీఎంకే అధికారంలో లేదు. జయలలిత గురించి ఏమాత్రం నెగిటివ్ గా చూపినా గందరగోళం జరగటానికి అవకాశాలెక్కువ. పైగా డీఎంకే ప్రభుత్వం కూడా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ముందుకు పోతోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తియ్యాయి. సెన్సార్ బోర్డు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు.
దీన్ని బట్టి ఇందులో వివాదాలులేవని అనుకోవాల్సి వస్తోంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇలాంటి వివాదాలు లేకుండా ఎలా ఉంటుందా అన్న అనుమానాలైతే ఉన్నాయి. జయలలిత విద్యార్థి దశ నుంచి రాజకీయ నేతగా ఎదిగే క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఉంటాయని చిత్రయూనిట్ అంటోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత సమాధిని సందర్శించి కంగనా రనౌత్ నివాళులర్పించారు. అలాగే కరుణా నిధి సమాధిని కూడా సందర్భించారు. సినిమా మీద మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. ఏంజరుగుతుందో చూడాలి.
Must Read ;- వినాయక చవితికి జయలలిత బయోపిక్











