ఆత్మహత్యల జాబితాలో మరో నటి చేరిపోయింది. కన్నడ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకోవడం శాండల్ వుడ్ లో సంచలనం కలిగించింది. 2017లో ఆమె చిత్ర రంగ ప్రవేశం చేశారు. అక్కడ జరిగిన బిగ్ బాస్ సీజన్ 3లో ఆమె పాల్గొన్నారు. ఆమె గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంటు ద్వారా తెలిపారు కూడా.
గత ఏడాది జులైలోనే ఆమె ఈ తరహా పోస్టు పెట్టారు. తనను ఫాలో అవుతున్న ప్రపంచానికీ, డిప్రెషన్ కూ గుడ్ బై అంటూ ఆమె అప్పట్లో పోస్టు పెట్టి సంచలనం కలిగించారు. నెటిజన్ల ఓదార్పు మాటలు ఆమెపై పనిచేయలేదు. అలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని భావిస్తున్నారు.
Must Read ;- ఆమె ఆత్మహత్యతో తన కోరిక నెరవేరలేదన్న సీనియర్ నటి!