తాజాగా కామెడీ కథతో శ్రీవిష్ణు హీరోగా తేజ మార్ని ( జోహార్ ఫేమ్) దర్శకత్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న చిత్రం గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో శ్రీవిష్ణు సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది.. తొలి సన్నివేశానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లాప్ నివ్వగా, సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. స్వరూప్ ఆర్.ఎస్.జె. గౌరవ దర్శకత్వం వహించగా…శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, అన్వేష్ రెడ్డి చిత్రం స్క్రిప్టును దర్శక నిర్మాతలకు అందించారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్‌కుమార్ చౌదరిఎం చైతన్య తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంభాషణలు: సుధీర్ వర్మ పి., సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి, సాహిత్యం: చైతన్య ప్రసాద్, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, యాక్షన్: రామ్ సుంకర, సహ నిర్మాత: ఎన్.ఎమ్. పాషా, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ మార్ని.
Must Read ;- మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో `సూపర్ పవర్`