దిగ్గజ భారత క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండెపోటు వచ్చింది. దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన యాంజియోప్లాస్టీ శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు.
1983 ప్రపంచ కప్ సమయంలో జట్టుకు ప్రాతినిధ్యం వహించి దేశానికి ప్రపంచ్ కప్ ను అందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 లో కూడా కపిల్ తన అభిప్రాయాలను అభిమానులకు తెలియజేస్తూ చురుకుగా పాల్గొంటున్నారు.
భారత మాజీ కెప్టెన్ అయిన కపిల్ దేవ్ డయాబెటిస్ సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ‘హర్యానా హరికేన్’ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలు ఉంచడంతో కపిల్ గుండెపోటు విషయం బయటకు వచ్చింది.
భారత దేశానికి తొలి ప్రపంచ కప్ ను అందించడంలో కపిల్ కీలక పాత్ర వహించారు. లాక్ డౌన్ సమయంలో తను ఎలా ఉన్నాను అనే విషయాన్ని కూడా కపిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీంతో ఆయన అభిమానులు ఆయన కొత్త లుక్ ఎంతో ట్రెండీగా ఉందంటూ కామెంట్లు కూడా చేశారు. ‘ఇప్పుడు ఇలా గుండెపోటు రావడం అనేది చాలా బాధకరం అయిన విషయం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు’అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.