కరోనాతో ఇంట్లో ఉన్నవారికి మంచి కాలక్షేపం ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వారాంతంలో వరసగా సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ధనుష్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కర్ణన్’ అమెజాన్ ద్వారా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ధనుష్ గెటప్ కూడా వైవిధ్యంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రజల హక్కుల కోసం పోరాడే పాత్ర ఇది. ఈ సినిమాకి రీరికార్డింగ్ ప్రధాన ఆకర్షణ అంటున్నారు.
ఇక బండి అనే తెలుగు సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ ద్వారా రాబోతోంది. ఇది కూడా వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన సినిమా. ఓ గ్రామంలో కొందరు యువకులు ఓ ఆటోలో కెమెరాలు పెట్టుకుని సినిమా తీయడానికి ప్రయత్నిస్తారు. సహజత్వానికి పెద్దపీట వేసి దీన్ని రూపొందించారు. ఇక ఆంథాలజీ యానిమేటెడ్ సిరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది. లవ్, డెత్ అండ్ రోబోట్స్ 2 పేరుతో ఈ సిరీస్ రూపొందింది. ప్రేమ, సెక్స్, రోబోట్స్ కథాంశంతో ఇది తెరకెక్కింది. మనం ఎటుపోతున్నామో ఆత్మ పరిశీలన చేసుకునేలా ఇది తెరకెక్కింది.
అలాగే నెట్ ఫ్లిక్స్ లోనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ కూడా ఈ వారం రాబోతోంది. దీనిపేరు అల్మామేటర్. ఇంటెన్సివ్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రశాంత్ రాజ్ రూపొందించారు మరియు ప్రసిద్ధ హాస్యనటుడు బిస్వా కల్యాణ్ రాత్ కూడా నటించారు. ‘అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ’ పేరుతో ఓ వెబ్ సిరీస్ అమెజాన్ లో ప్రసారం కాబోతోంది. భావోద్వేగాల సమ్మిళితంగా ఇది రూపొందింది. ఇప్పుడు ప్రస్తావించిన అన్నీ దేని ప్రత్యేకత దానికే ఉంది. ఏది కావాలో ఎంచుకుని చూడవచ్చు.
Must Read ;- సీఎం సహాయనిధికి రజినీ కుమార్తె సౌందర్య సాయం