సినీ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది. ఆయన మొహంలో ఎముకలు చాలా విరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఎడమ కన్ను పూర్తిగానూ, కుడి కన్ను కొంత దెబ్బ వరకూ దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. రెండు కళ్లూ ఈరోజు ఆపరేషన్ చేయవచ్చని అంటున్నారు. ఆయన మొహాన్ని కార్నియో ఫేషియల్ రీకన్ స్ట్రక్షన్ ఆపరేషన్ ద్వారా సరిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ సోమవారం జరుగుతుంది.
ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరమవుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను వెంకట్ సిద్ధారెడ్డి తన ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ మట్లాడటం కూడా సాధ్యం కాదు. మహేష్ బ్రెయిన్ కు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. వెంకట సిద్ధారెడ్డి, వెంకటేష్ మహా ఎప్పటికప్పుడు మీడియాతో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరిది రామానాయుడు ఫిలిం స్కూలులో ఏర్పడిన స్నేహం. సినిమాల్లోనూ కలిసి ప్రయాణం సాగిస్తున్నారు.
ఆర్థిక సహకారాన్ని కూడా వీరే అందిస్తున్నట్లు తెలుస్తోంది. కత్తి మహేష్ విజయవాడ నుంచి చెన్నైకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనతో కారులో ఎవరెవరు ఉన్నారన్న దానిమీద కూడా స్పష్టత లేదు. డ్రైవర్ తో కలిపి మొత్తం ముగ్గురు ఉన్నారని చెబుతున్నారు. కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదని, ఇంతగా గాయాలు కావడానికి అదే కారణమని అంటున్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన దాదాపు కోలుకున్నట్లుగానే చెబుతున్నారు.
Must Read ;- కత్తి మహేశ్ త్వరగా కోలుకోండి.. పవన్ ఫ్యాన్స్ ట్వీట్స్!











