సాధారణంగా గట్టిగా అరచి మాట్లాడే వాళ్లను ‘వీడు చిన్నప్పుడు విజిల్ మింగేశాడు రా..’ అంటుంటాం. కానీ, ఈ 40 ఏళ్ల మహిళ.. గట్టిగా మాట్లాడేదో లేదో తెలియదు గానీ.. చిన్నప్పుడు విజిల్ మాత్రం మింగేసింది. అర్థం కాలేదా..! అయితే విషయం తెలుసుకోండి. కొన్నేళ్లుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆ మహిళ.. డాక్టరు వద్దకు వెళ్లింది. పరీక్షించిన ఆయన.. గొంతులో ఏదో వస్తువు ఉందని అనుమానించాడు. బ్రోంకోస్కోపీ చేసి చూడగా.. గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే మార్గంలో ఓ చిన్న విజిల్ ను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు.
ఈ ఘటన కేరళలోని కన్నూరు జిల్లా మట్టనూరులో జరిగింది. ఆ మహిళ.. 15 ఏళ్ల వయసులో ఉండగా.. ఆడుకునే క్రమంలో పొరపాటున ఓ విజిల్ ను మింగేసింది. దీంతో.. కంగారుపడి ఎక్కువగా నీళ్లు తాగేసింది. అక్కడితో ఆ సమస్య తీరిపోయిందిలే అని భావించింది. కానీ, ఆ విజిల్ మాత్రం గొంతుకి, ఊపిరి తిత్తులకి మధ్య.. ఇరుక్కుపోయి.. అలాగే పాతికేళ్లు ఉండిపోయింది. దీని ప్రభావం వల్ల.. ఆమె దాదాపు రెండు దశాబ్దాలు తీవ్రమైన దగ్గుతో బాధపడింది. దీన్ని తొలగించగానే ఆమె సమస్య తీరిపోయింది.
Must Read ;- స్వతంత్ర భారత చరిత్రలో.. మొట్టమొదటిసారిగా మహిళా దోషికి ఉరి..!
Also Read ;- ఆ విమానం నడిపేది మహిళా పైలెట్లే..!











