ఎంపీని కొట్టడమంటే పార్లమెంట్‌ను అవమానించడమే అని కేరళ ఎంపీ ప్రేమ్‌చంద్రన్ పేర్కొన్నారు. ఏపీ సీఐడీ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ రఘురామరాజు రాసిన లేఖపై ఆయన ఈ విధంగా స్పందించారు.ఈ అంశాన్ని తప్పకుండా పార్లమెంట్లో లేవనెత్తుతానని ప్రేమ్ చంద్రన్ పేర్కొన్నారు. రఘురామరాజు తనపై జరిగిన దాడిని వివరిస్తూ ఎంపీలందరికీ లేఖలు పంపగా చాలామంది స్పందిస్తున్నారు. తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్, శివసేన ఎంపీ రఘురామరాజుకు మద్దతుగా స్పందించిన విషయం తెలిసిందే.
Must Read ;- ఏఏజీపై బార్ కౌన్సిల్‌కు రఘురామరాజు ఫిర్యాదు.. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగంపై ఎంపీలకు లేఖలు