కేజీఎఫ్ చిత్రం హీరో యాశ్ ఒక్కసారిగా హైప్ వచ్చింది.ఈ చిత్రం యువహీరో రెంజ్ ని పెంచింది. ఒక్క సినిమా తో తెలుగు తెర పై నిలదొక్కునే అవకాశం చేజిచ్చికున్నారని సినిమా పెద్దలు చెప్పుతున్నారు.అంతే కాకుండా హీరో జీవితాన్ని నిలబెట్టిందని తెలుస్తోంది. కేజీఎఫ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆ యువ హీరో దిల్ రాజు బ్యానర్ లో నటించేందుకు అవకాశం లభించిందని ఇండస్ట్రీలో టాక్.తాజాగా యశ్ నటించిన చిత్రం కేజీఎఫ్ 2 విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. తన నటన తో అభిమానలను సొంతం చేసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో నటించేకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేజీఎఫ్ 2 విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్బంలో దిల్ రాజు తో పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిస్తుంది..
ఇది ఇలా ఉంటే వెండి తెర పై స్టార్ హీరోగా క్రేజ్ సంపాధించుకోవడం అంత సులువైన విషయం కాదు.కానీ కుర్రహీరో యశ్ విషయం లోమాత్రం అందుకు భిన్నం అని తెలుస్తుంది. తన స్టార్డమ్ తో అవకాశాలను దక్కించుకుంటున్నాడు. కొద్ది మందికి మాత్రం అవకాశం కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు.
కేజీఎఫ్ 2 సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. వేయి కోట్ల క్లబ్ లోకి చాలా తేలికగా చేరిపోయినచ్వు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఒక్క హిందీలోనే 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం ప్రత్యేకం.కేజీఎఫ్ 2 కు సీక్వెల్ గా కేజీఎఫ్ 3 కూడా ఉందని చెప్పడంతో ఆయన ఆ సినిమా పనుల్లోనే ఉంటాడని అనుకున్నారు.
కానీ ఈ లోగా ఆయన తెలుగులో ఒక భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తుననాయి. సినిమాకి నిర్మాత దిల్ రాజు అని, యశ్ తోను ఓ ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టు వినికిడి. త్వరలోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం.