Kiara Advani Next Movie :
కైరా అద్వానికి బాలీవుడ్లో భారీ క్రేజ్ ఉంది. పొన్నాగి పువ్వులాంటి ఈ సుందరి కలువరేకు కళ్లతో పడుచుమనసులను లూటీ చేసేస్తూ ఉంటుంది. చక్కని మేనిఛాయతో కూడిన సొగసులతో కుర్రాళ్ల మనసులను ‘జలతారు’ను చేసి మీటుతూ ఉంటుంది. అందానికి తగిన అభినయం ఈ అమ్మడి సొంతం. అందువల్లనే కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తనదైన గ్లామర్ తో ఈ బ్యూటీ తన జోరును .. హోరును కొనసాగిస్తూనే ఉంది. ఇతర భాషల్లోను అభిమానుల సంఖ్యను పెంచుకుంటూనే ఉంది.
పంచదార చిలకలాంటి ఈ అమ్మాయిని ‘భరత్ అనే నేను’ సినిమాతో కొరటాల పరిచయం చేశారు. మహేశ్ బాబు జోడీగా ఈ అమ్మాయి సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. తెరపై కైరాను చూసిన వాళ్లంతా దీపానికి రూపం వచ్చినట్టుగా ఉందంటూ కితాబునిచ్చారు. ఆ తరువాత చరణ్ సరసన ఆమె చేసిన ‘వినయవిధేయరామ’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకు పడవలసిన మార్కులు పడిపోయాయి. ఆ తరువాత ఈ సుందరి బాలీవుడ్లో బిజీ కావడం వలన, ఇక తెలుగులో చేసే తీరిక లేకుండా పోయింది.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల ఒక సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కైరా పేరు వినిపిస్తోంది. గతంలో తనకి హిట్ ఇచ్చిన కారణంగా ఆమె కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఇక ఇదే సమయంలో త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కూడా కథానాయికగా కైరా పేరే వినిపిస్తోంది. ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్ తో కెమిస్ట్రీ కుదిరిందనే టాక్ రావడం వలన, ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏదైనా ఒక సినిమాను మాత్రమే కైరా అంగీకరిస్తుందా? లేదంటే రెండు వైపులా ఉన్న సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని రెండింటినీ ఒప్పేసుకుంటుందా? అనేది చూడాలి.
Must Read ;- అందాలు ఆరబోసినా కలిసిరాని కాలం!











