తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే కొత్త సినిమా ప్రకటిస్తానంటోంది. బహుశా, కియరా అద్వానీ
చేయబోయే సినిమా తెలుగులోనే కావొచ్చు.
రీసెంట్ గా ఓ సెలబ్రేషన్ చేసుకుంది కియరా అద్వానీ. ఆమె ఇండస్ట్రీకొచ్చి ఏడేళ్లు అయింది. ఈ
సందర్భంగా బాలీవుడ్ లో చాలా హంగామా నడిచింది. దాదాపు అలాంటిదే హంగామానే టాలీవుడ్ లో కూడా
జరిగింది. కియరా ఫ్యాన్స్ బాగానే ట్రెండ్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని లీకులు
వదిలించి కియరా. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్టు ప్రకటిస్తానంటూ ఊరించింది.
కియరా ఇలా ప్రకటించిందో లేదో అలా ఊహాగానాలు, కొత్త కొత్త కథనాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా
ఆ ఊహాగానాలన్నీ ఎన్టీఆర్-కొరటాల సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి ఓ కారణం ఉంది. ఈ ప్రాజెక్ట్
ప్రకటించిన వెంటనే కియరా పేరు తెరపైకొచ్చింది. ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా
వార్తలొచ్చాయి. ఇప్పుడదే ప్రాజెక్టును కియరా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
కొరటాల శివ డైరక్ట్ చేసిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కియరా. ఆ సినిమా
ఆమెకు బాగా హెల్ప్ అయింది. తెలుగులో కూడా మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఆ వెంటనే ఆమె
చేసిన వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఆ ప్రభావం కియరాపై పడలేదు. అదే
టైమ్ లో ఆమె బాలీవుడ్ లో క్లిక్ అయింది. వరుసపెట్టి హిట్స్ కొట్టింది.
అలా బాలీవుడ్ లో పెరిగిన క్రేజ్ వల్ల ఆమెకు టాలీవుడ్ లో కూడా ఇమేజ్ పెరిగింది. అందుకే వినయ
విధేమ రామ ప్రభావం ఆమెపై పడలేదు. అయితే ఆ సినిమా తర్వాత కియరా మళ్లీ తెలుగులో
కనిపించలేదు. ఇన్నాళ్లకు #NTR30 సినిమాతో ఆమె తిరిగి టాలీవుడ్ కు వస్తుందంటున్నారు
చాలామంది. అదే నిజమవ్వాలని కోరుకుంటున్నారు తారక్ అభిమానులు.
ఎన్టీఆర్ ప్రాజెక్టు కోసం కియరాను తీసుకోవడం వెనక ఓ చిన్న లాజిక్ ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా
చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇది పాన్ ఇండియన్ మూవీ. ఈ సినిమా తర్వాత ప్రభాస్ టైపులో తనకు కూడా
బాలీవుడ్ లో ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఆ ఇమేజ్ ను అలానే కంటిన్యూ
చేయాలంటే, కొరటాల సినిమాకు బాలీవుడ్ కనెక్ట్ ఉన్న హీరోయిన్ కావాలి. అందుకే ఏరికోరి మరీ కియరాను
తీసుకున్నారు.
మరోవైపు ఈ సినిమా కోసం కియరా 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని, అంత మొత్తం ఇవ్వడానికి
మేకర్స్ కూడా ఒప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. రెమ్యూనరేషన్ సంగతి పక్కనపెడితే.. ఎన్టీఆర్-కియరా
కాంబో మాత్రం సిల్వర్ స్క్రీన్ పై చాలా ఫ్రెష్ గా కనిపించడం ఖాయం.
Must Read ;- హాట్ బికినీ విడియోతో మత్తెక్కిస్తోన్న కియారా











