టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. ఎన్నో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. ఇటీవల వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా థియేటర్ లో ఆశించిన స్ధాయిలో సక్సస్ సాధించకపోయినా.. ఓటీటీలో మాత్రం సక్సస్ సాధించింది. ప్రజెంట్ కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం.. ఓటీటీలకు డిమాండ్ పెరగడం తెలిసిందే. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్, స్టార్ హీరోల ఆలోచనా విధానం మారింది. ఓటీటీకి ఉన్న క్రేజ్, రీచింగ్ గుర్తించడంతో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లు చేయడానికి స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. నాగార్జున కూడా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. టాలీవుడ్ డైరెక్టర్ చెప్పిన స్టోరీకి నాగార్జున ఓకే చెప్పారని తెలిసింది. ఇది కేవలం ఓటీటీలో రిలీజ్ చేసేందుకే ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే నాగ్ ఓటీటీ ఎంట్రీ గురించి అఫిసియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలో రిలీజ్ చేసే ఈ మూవీ గురించి పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. నాగ్ ప్రయోగాలు చేయడంలో ముందుంటారు. ఇప్పటి వరకు వెండితెర మీద ఎన్నో ప్రయోగాలు చేశారు.
ఇప్పుడు డిజిటల్ మీడియాలో కూడా ప్రయోగం చేయబోతుండడం విశేషం. ఇక నాగ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున.. బంగార్రాజు మూవీ చేయనున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నారు. సంక్రాంతికి బంగార్రాజు మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. నాగ్ ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- కొడుకుల సినిమా కాపురాలు దిద్దే ప్రయత్నాల్లో నాగ్











