మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైంది. బందరులో జరిగిన ఒక హత్యకేసులో ప్రమేయం ఉన్నట్లుగా కొల్లు రవీంద్రపై ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ మూడుసార్లు రిజెక్ట్ అయింది. తాజాగా… సోమవారం బెయిల్ మంజూరైంది.
మచిలీపట్నానికి చెందిన మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు. ఈ హత్య పాత కక్షలతో జరిగినది గా వ్యాప్తిలోకి వచ్చినప్పటికీ.. నిందితులు కొల్లు రవీంద్ర అనుచరులు అని తెలియడంతో అరెస్టు చేశారు. అప్పటినుంచి రవీంద్ర జైల్లోనే ఉన్నారు.
తెలుగుదేశానికి చెందిన ముగ్గురు నాయకుల్లో ఇంకా ఒక్కరు మాత్రం జైల్లోనే ఉన్నారు. ఏసీబీ కేసులో అరెస్టు అయిన అచ్చెన్నాయుడుకు ఇప్పటిదాకా బెయిల్ రాలేదు. కాకపోతే ఆయన కొవిడ్ తో ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్ర ఇద్దరూ వేర్వేరు కేసుల్లో అరెస్టు కాగా.. ఇద్దరికీ బెయిల్ లభించింది.