బాబిసింహ నిజానికి అతను తెలుగువాడు. ఈ మధ్య తన కుమారుడి మొక్కు తీర్చుకోడానికి కృష్ణాజిల్లాలోని మోపిదేవి వచ్చారు. అంతకు ముందు తన కుమార్తె మొక్కును కూడా అక్కడే తీర్చుకున్నానని చెప్పారు. ఈ మండలంలోనే కోసూరిపాలెం అతని స్వగ్రామం. అలాంటి బాబి సింహా ప్రధాన పాత్ర పోషించిన ఇంటెన్స్ రా యాక్షన్ చిత్రం కోనసీమ థగ్స్. ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న కోనసీమ థగ్స్ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు.
తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ మధ్యన విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆ వీడియో చిత్రం పై అంచనాలు రెట్టింపు చేసింది. ఇప్పుడు టీం చిత్ర ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. డిజిటల్ ట్రైలర్ ను విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్ మరియు కీర్తి సురేష్ విడుదల చేశారు.రెండు నిముషాల 23 సెకన్ల నిడివి ఉన్న కోనసీమ థగ్స్ ట్రైలర్ వయోలెన్స్ తో కూడిన ఒక ఇంటెన్స్ ఫిల్మ్ ను పెక్షకులకు పరిచయం చేసింది. కోనసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ట్రైలర్ లో హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, అనస్వర రాజన్ పాత్రలు ఉత్కంఠ రేపేలా రివీల్ చేశారు దర్శకురాలు బృంద.
హ్రిదు హరూన్, శేషు పాత్రలో రా అండ్ రస్టిక్ క్యారక్టరైజేషన్ తో చూడగానే రిజిస్టర్ అయిపోతారు. పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీ నీ చాలా బాగా క్యారీ చేశారు. హ్రిదు కి నటుడిగా చాలా మంచి భవిష్యత్తు ఉండబోతోంది అని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుండి బయటపదెందుకు పాత్రలు వేసే ఎత్తులు అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్తితులతో ఆడియెన్స్ ను ఆద్యంతం ఉత్కంఠ కు గురిచేసేలా ఉంది. శామ్ సి ఎస్ సంగీతం ట్రైలర్ లోని ఇంటెన్సిటీనీ మరింత పెంచేలా ఉండగా, ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ నీ ఎన్హాన్స్ చేస్తోంది.
ట్రైలర్ లో ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ కట్స్ కోనసీమ థగ్స్ మీద ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతోంది. అన్నిటి కంటే ప్రధానంగా కోరియోగ్రఫర్ టర్న్డ్ డైరెక్టర్ బృందా టేకింగ్, ఒక వయోలెంట్ వరల్డ్ లో ఎంత వరకైనా తెగించే పాత్రలతో ఒక పారలల్ గా టెన్షన్ మెయింటైన్ చేసే మేకింగ్ స్టైల్ తో అదరగొట్టారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదలకు సిద్దం అవుతోంది. హ్రిదు హరూన్, బాబిసింహా, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని తదితరులు నటించారు. బీఏ రాజు టీమ్ దీని ప్రచార బాధ్యతలు చూస్తోంది. శ్యామ్ సి ఎస్ దీనికి సంగీతం సమకూర్చారు.