మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది. శేశ్రిత టెక్నాలజీ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. చీటింగ్, ఫోర్జరీ, చోరీ ఆరోపణలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సోమిరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఆనందయ్య మందును ఆన్లైన్ లో పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం తయారు చేసిన వెబ్సైట్ పై సోమిరెడ్డి విమర్శలు చేశారు. మందు అమ్మకానికి వెబ్సైట్ తయారుచేసిందంటూ ఆరోపించడం కేసు పెట్టడానికి కారణమైన్నట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందు పంపిణీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుట్ర చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నోసార్లు ఆరోపించారు. ఈనేపథ్యంలో శేశ్రిత టెక్నాలజీ ఎండీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.
Must Read ;- ఆనందయ్య మందు అమ్ముకోడానికి స్కెచ్ : చంద్రమోహన్ రెడ్డి