ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనలో సాధించిందేమీ లేదన్న విషయం క్రమేపీ అందరికీ అర్థమవుతోంది. రాష్ట్ర పురోగతికి పెట్టుబడులు ప్రధానమైనవి. ఏ రాష్ట్రంలో అయినా కొత్త సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తే స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అయితే జగన్ పాలనలో నాలుగేళ్లలో అలాంటి చెప్పుకోదగ్గ సందర్భం ఒక్కటి కూడా లేదు. లక్షల కోట్ల పెట్టుబడులంటూ గ్లోబెల్ ఇన్వెస్టర్ సదస్సుల్లో ఊదరగొట్టేయటం తప్ప పరిశ్రమల జాడే లేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో
తీసుకున్న నిర్ణయాలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పరిశ్రమలు కూడా ముఖం
చాటేస్తున్నాయి. అలా ఆసక్తి చూపిన సంస్థలు గుడ్ బై చెప్పేస్తున్నాయి.
తాజాగా ఏపీ వద్దనడంతో లూలు సంస్థ కూడా ఏపీకి టాటా చెప్పేసి తెలంగాణలో వ్యాపారం ప్రారంభించింది. ఇలా చాలా సంస్థలు తలోదారి చూసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం. కానీ ఇప్పుడు వైసీపీ అరాచక పాలనకు భయపడి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపెటాయి.అందుకు తగ్గట్టుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అయితే జగన్ ట్రేడ్ మార్క్ పాలన మొదలయ్యాయ వాటన్నిటిపైనా సమీక్షల పేరుతో పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులకు గురి చేసింది. దీంతో చాలా మందిలో ఏపీపై ఆసక్తి తగ్గిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. మొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని పరోక్షంగా చెప్పారు. ఏపీలో జగన్ ట్రేడ్ మార్క్ పాలనకు చురకలేంటేలా మాట్లడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలకు భూములు ఇవ్వాలని జగన్ కు రికమెండ్ చేస్తానని పెట్టుబడి దారులతో అన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని కోరతానని కూడా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇవేమీ సక్రమంగా సాగటం లేదని ఇండైరెక్ట్‌గా జగన్ ట్రేడ్ మార్క్ పాలనను కేటీఆర్ గుర్తుచేశాడు. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణను చూసైనా పారిశ్రామిక వేత్తల విషయంలో జగన్ వైఖరి మారాలని అక్కడి వాళ్లంతా అనుకున్నారట.