నటి మాధవీలత హీరోయిన్ గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీతో ‘లేడీ’ అనే సినిమా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మాధవీలత సోలో పెర్ఫార్మెన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీఎస్ఎస్ఎస్ పి కళ్యాణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఛరన్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీకే స్టూడియోజ్ బ్యానెర్లు పై సత్యనారాయణ గొరిపర్తి, జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ ఈ రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా నిర్మిస్తున్నారు.
ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీకి సంబంధించిన టీజర్ ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులును ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. అదే రీతిన తాజాగా విడుదల చేసిన టీజర్ ని కూడా రెడీ చేశారు లేడీ చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమాకి మాధవీలత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది.











