రాయ్ లక్ష్మీ ని తెరపై చూసినవారెవరైనా ఈ అమ్మాయిని హాలీవుడ్ నుంచి తీసుకున్నారా? అనుకుంటారు. హాలీవుడ్ తెరపై గుర్రాలపై తిరుగుతూ .. గన్స్ తో బుల్లెట్లలా వర్షం కురిపిస్తూ దూసుకుపోయే యాక్షన్ హీరోయిన్ ను తెచ్చుకున్నారేమోనని అనుకుంటారు. ఎందుకంటే అమ్మడి హైటూ .. రంగు .. ఫిగర్ అలాంటిది మరి. ఆమె హాలీవుడ్ స్టార్ లా అనిపించడం వల్లనే కావొచ్చు .. ఇక్కడెక్కడా నిలదొక్కుకోలేకపోతోంది. కెరియర్ మొదలై 15 ఏళ్లు దాటి పోయినా ఆమెకి లభించిన గుర్తింపు అంతంత మాత్రమేనని చెప్పొచ్చు.

రాయ్ లక్ష్మీకి ఒక గ్లామరస్ హీరోయిన్ కి ఉండవలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే అందరూ కూడా ఆమెకి గ్లామర్ పరమైన పాత్రలనే ఇస్తూ వచ్చారు. ఆమె కూడా అలాంటి పాత్రలనే చేస్తూ వచ్చింది. అవసరమైనప్పుడు ఐటమ్ సాంగ్స్ లోను మెరిసింది. ఆ మధ్య వచ్చిన ‘రత్తాలు’ సాంగులో ఆమె చెలరేగిపోయిన విషయం తెలిసిందే. ఒక వైపున తనకి దక్కిన పాత్రలను చేస్తూనే, మరో వైపున సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కవ్విస్తోంది .. కైపెక్కిస్తోంది. తాజాగా జీన్స్ ప్యాంటు ధరించి మోడ్రన్ లుక్ తో కుర్రాళ్ల గుండె గ్రౌండులో రచ్చ చేస్తోంది.
రాయ్ లక్ష్మీ గ్లామర్ లో ప్రత్యేకమైన ఆకర్షణ ఆమె హైటు మాత్రమే కాదు .. కలర్ కూడా. ఆమె స్కిన్ టోన్ ను నోరెళ్లబెట్టి చూడని పురుషపుంగవులు ఉండరంటే ఒట్టు. ఈ పోజులోను పసుపు – పాలు కలిసిన మేనిఛాయతో ఆమె అందానికే అందం అన్నట్టుగా కనిపిస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల గుండెల్లో జే గంటలు మోగిస్తోంది. వివిధ భాషల్లో కలుపుకుని ఆమె చేతిలో ఓ అరడజను సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఎన్ని హిట్లు కొడుతుందో .. కుర్ర మనసులను ఎన్ని పట్లు పడుతుందో చూడాలి.
Must Read;- కుర్రకారు గుండెల్లో వలపుల థిల్లానా..!











