ఈ ఏడాది బిగినింగ్ లోనే ‘అశ్వథ్థామ’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. అదే ఉత్సాహంతో వరుసగా తదుపరి చిత్రాల్ని లైన్ లో పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ జాబితాలో ఉన్న ఒక ఆసక్తికరమైన సినిమా అతడికి 20వది కాబోతుండడం విశేషం. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ , యల్.యల్.పీ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైలిమిట్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాకి కొత్త కుర్రోడు సంతోష్ జాగర్లపూడి దర్శకుడు.
ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలోని పాత్రకోసం నాగశౌర్య చాలా డిఫరెంట్ గా మేకోవర్ అయ్యాడు. దీని కోసం సిక్స్ ప్యాక్ బిల్డ్ చేసి.. ఆర్చరీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అలాగే.. జిమ్ లో అధిక సమయం కసరత్తుల కోసం కేటాయించి.. మంచి ఫిట్ నెస్ సాధించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు సాయంత్రం రివీల్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల వారి సమాచారం ప్రకారం దీనికి ‘లక్ష్య’ అనే డైనమిక్ టైటిల్ ను ఖాయం చేశారనే వార్తలు వినిస్తున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా టైటిల్ ఏంటనే సస్పెన్స్ వీడనున్నది. మరి నిజంగా ఈ సినిమాకి ‘లక్ష్య’ టైటిల్ ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.











