వరంగల్ జిల్లా జనగామాలోని పెంబర్తి గ్రామంలో లంకెబిందెలు బయటపడ్డాయి. హైదరాబాద్ కు చెందిన నాగరాజు అనే వ్యాపారి వెంచర్ కోసం నెలరోజుల క్రితం పెంబర్తిలో భూమిని కొన్నాడు. గురువారం ఆయన భూమిని చదును చేస్తుండగా, లంకెబిందెలు బయటపడ్డాయి. లంకెబిందెల్లో ఐదు కిలోల బంగారం ఉన్నట్లు, అవి కాకతీయుల కాలం నాటివని తెలుస్తోంది. ఈ విషయమై నాగరాజు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని, లంకె బిందెలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా, పంచనామా చేశారు. పెంబర్తిలో లంకెబిందెలు బయటపడ్డాయనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వాటిని చూసేందుకు చాలామంది క్యూ కడుతున్నారు.
డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...











