పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ అప్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీపావళికి టీజర్ వస్తుంది అనుకున్నారు కానీ.. రిలీజ్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో వకీల్ సాబ్ టీమ్ చెప్పలేదు. అయితే.. సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్ రానున్నట్టు సమాచారం. ఇంకా పవన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సివుంది. త్వరలోనే ఆ సన్నివేశాలను చిత్రీకరించి షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇందులో పవన్ కళ్యాణ్ తాగుబోతుగా కనిపిస్తాడట. తాగుబోతు అంటే.. అలా ఇలా కాదు. పొద్దున్నుంచి రాత్రి వరకు తాగడమే పనిగా పెట్టుకునే వీర తాగుబోతు. ఈ సినిమాలో లాయర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్యారెక్టర్ లో ఉన్న మరో షేడ్ తాగుబోతు. అసలు సినిమా తాగుబోతు క్యారెక్టర్ నుంచే స్టార్ట్ అవుతుందట. అయితే.. ఈ తాగుబోతు క్యారెక్టర్ ని సీక్రెట్ గా ఉంచాలి అనుకోవడం లేదట. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేయనున్నారని తెలిసింది.
ఈ టీజర్ లో తాగుబోతు క్యారెక్టర్ ని పరిచయం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్, జల్సా, గుడుంబా శంకర్, ఖుషీ, బద్రి సినిమాల్లో తాగుబోతు సన్నివేశాల్లో నటించాడు. అయితే.. అందులో మందు తాగి కామెడీ చేశాడు. ఆడియన్స్ కి బాగా నచ్చింది. అయితే.. వకీల్ సాబ్ తాగి కామెడీ చేసాడా.? సీరియస్ గా ఫైట్స్ చేసాడా.? అనేది తెలియాల్సివుంది. ఏది ఏమైనా.. పవన్ కి తాగుబోతు క్యారెక్టర్ బాగా కలిసొచ్చింది. ఈ లెక్కన తాగుబోతు సెంటిమెంట్ వపన్ కి మళ్లీ కలిసొస్తుందా.? మరో విజయాన్ని అందిస్తుందా.? అనేది చూడాలి.
Must Read ;- పవన్ మూవీలో రానా నటిస్తున్నాడా.? లేదా.?