బాబాయ్ సమాధిపై.. సీఎం కూర్చి..! ఆయన అరెస్ట్ తో కేసు క్లోజ్..!
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న బ్యాచ్ కు ఉచ్చు బిగుసుకుంటుంది. స్వార్థ
రాజకీయ ప్రయోజనాలకు సొంత బాబాయ్ నే హతమార్చి సీఎం కూర్చి ఎక్కారు. నేడు దాన్ని కూడా వదిలి.. కేసును పక్కదోవ పట్టేందుకు కోర్టు, ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు జగన్ రెడ్డి.
బాబాయ్ వివేకా హత్య కేసును అబ్బాయ్ నాలుగునరేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం పీకారు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సిగ్గులేని బ్రతుకు కోర్టుల్లో.., ఢిల్లీలో లాబియింగ్స్ చేస్తోంది. ముఖ్యమంత్రి హోదాల్లో ఉండీ కూడా బాబాయ్ హత్య కేసును తేల్చలేక కోర్టులో వాయిదాల పర్వంలో రాజకీయం చేస్తుంటే.. సామాన్యుల పరిస్ధితి ఏంటీ..? అని అందరిలో పలు అనుమానాలు రేకిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ కుటుంబంలోని వైఎస్ భాస్కర్ రెడ్డి జైల్లో ఉండి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియని పరిస్ధితి.
ముఖ్యమంత్రి పీటం కోసం మర్డర్లు చేసి.. రిగింగ్స్ చేసి.. మోసపూరిత హామీలిచ్చి నీవు సాధించింది ఏంటీ..? అని జగన్ రెడ్డిపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కుటుంబంలో చెల్లెలు.., ఆ తరువాత తల్లి విజయమ్మ లు జగన్ ప్రవర్తనకు దూరంగా జరిగారు. చెల్లెలు షర్మిల అయితే .. ఏపీ రాజకీయాల్లో అన్నపై యుద్ధం ప్రకటించేందుకై సిద్ధమవుతున్న పరిస్ధితి. చివరికీ కుటుంబమే కాదు..వైఎస్ వంశం కూడా జగన్ రెడ్డి నీచపు ఆలోచనలకు దూరమవుతున్నారు.
సొంత బాబాయ్ హత్య కేసులు ప్రధాన నిందుతుడిగా జగన్ రెడ్డి తమ్ముడు, ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు. ఇప్పటికే వివేకా హత్యలో జైల్లో ఉన్న ఇంకో బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎప్పుడు బెయిల్ మంజూరు అవుతోందో తెలియని పరిస్ధితి. తాజాగా తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువడించింది. కస్టడీలో ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి లు హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది. సీబీఐ కోర్టులో తిరస్కరణకు గురైన బెయిల్ పిటిషన్ను.. తిరిగి హైకోర్టు అపీల్ ద్వారా పొందాలని చూసినా.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే.., బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఎప్పుడైతే తిరస్కరణకు గురైందో అప్పటినుంచే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐ ఇంకా స్పీడ్ పెంచనున్నదని క్లారిటీ వస్తోంది.
గతంలో వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వివేకా కూతురు వైఎస్ సునీత, సీబీఐ వాదనలను నిశితంగా విన్న హైకోర్టు.. వారి వాదనలతో పూర్తిగా ఏకభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ మంజురు సాధ్యకాదని న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. ఈ హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే.. జరిగే పరిణామాలపై కూడా సీబీఐ కోర్టుకు వివరించింది. వాదనల్లో మెరిట్స్ ఉండడంతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఇక వాట్ నెక్స్ట్ అన్నదానిపై సీబీఐ దర్యాప్తులో స్పీడ్ పెంచనున్నది. హత్యలో ప్రధాన పాత్ర దారులందరూ అరెస్ట్ చేసిన సీబీఐకు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తో సూత్రదారుల పాత్ర కూడా ఈ హత్య కేసులు ముగుస్తోందన్న ఆలోచనలో సీబీఐ ఉంది అన్నది వాస్తవం.