స్టార్ హీరోల స్టామినా వారు నటించిన సినిమాలకి వచ్చే కలెక్షన్స్ మీదనే ఆధారి పడి ఉంటుంది. ఇప్పుడున్న స్టార్ హీరోల సినిమాలు దాదాపుగా 100 కోట్లు కలెక్షన్స్ మార్క్ ని అవలీలగా దాటేస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ సినిమాలు దాదాపుగా 100 కోట్లు మార్క్ ని అందుకుంటున్నాయి. లారెన్స్ లాస్ట్ మూవీ కాంచెన 3 అన్ని భాషల్లో కలిపి 115 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.
అలానే లారెన్స్ ఇటీవల అక్షయ్ కుమార్ ని హీరోగా పెట్టి లక్ష్మీ బాంబ్ పేరటి హిందీలో కూడా సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ వారు ఏకంగా 175 కోట్లకు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి కొనుకున్నారు. అటు డైరెక్టర్ గా ఇటు హీరోగా భారీ కలెక్షన్స్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకున్న లారెన్స్ ఇప్పుడు రంగస్థలం తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు. తెలుగులో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రను తమిళంలో లారెన్స్ పోషిస్తున్నాడు. అయితే ఈ ఎనౌన్స్ మెంట్ అయిన దగ్గర నుంచి లారెన్స్ ని తమిళ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
వీరికి తెలుగు రాష్ట్రాల నుంచి మెగా ఫ్యాన్స్ కూడా తోడవ్వంతో ప్రస్తుతం తమిళనాట ఇదే హ్యాపెనింగ్ ఇష్యూ. లారెన్స్ ఓవర్ యాక్షన్ ఇలాంటి పెర్మామెన్స్ ఉన్న స్టోరీల్లో ఇరిక్కిస్తే మొదటికు మోసం వస్తుందనే కామెంట్స్ వినిసిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నిక్కీ గల్రానీ నటిస్తోంది. ఈ కన్నడ బ్యూటీని తీసుకోవడం కూడా రాంగ్ కాస్టింగ్ అనే టాక్ నడుస్తోంది. ఏదైమైనా ఒకే కథని(కాంచన సిరీస్) తిప్పి తిప్పి జనాల మీద రుద్దుతున్న లారెన్స్ మాస్టర్ నుంచి చాలా రోజుల తరువాత ఓ ఫ్రెష్ కాన్సెప్ట్ వస్తుందని సినీ జనాలు అంటున్నారు.