నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలం కాబట్టే చాలామంది తరుచుగా వాడుతుంటారు. నిమ్మ వైరస్ ను చంపకపోవచ్చమోకానీ.. రోగ నిరోధశక్తిని మాత్రం పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం నీళ్లలో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొవచ్చు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుందట. శరీరంలోని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపి ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది.
Lemon Increases Immunity Power :
- నిమ్మకాయలో ఉన్న ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషదాల తయారీకి నిమ్మ పండును వినియోగిస్తుంటారు. అందుకే, నిమ్మను సకల రోగాల నివారణిగా పిలుస్తుంటారు.
- నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగిస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి ఇతర సమస్యలను రాకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే నిమ్మరసం తాగడం వల్ల అందులో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవకపోవడం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది.
- Must Read ;- వంటింట్లోనే ఆరోగ్యం..!