గవర్నర్ కోటాలో ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను కేసీఆర్ భర్తీ చేస్తూ ముగ్గురి పేర్లను శుక్రవారం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీమంత్రి, రజకసంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్ బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేస్తూ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది.
అయితే గవర్నర్ కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కవులు, కళాకారులు, సేవారంగానికి చెందిన వారికి ఎమ్మెల్సీలో చోటు దక్కబోతున్నట్లు ‘లియో న్యూస్’ ముందే తెలిపింది. ఇందులో గోరటి వెంకన్న పేరు ప్రధానంగా ఉండబోతున్నట్లు చెప్పింది. సెప్టెంబర్ 17న పోస్ట్ చేసిన ‘ఎమ్మెల్సీ లిస్టులో గోరటి వెంకన్న పేరు?’ అనే కథనంలో గోరటి వెంకన్నకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఛాన్స్ ఇస్తున్నట్లు ముందే చెప్పింది. ముందస్తుగా లియో న్యూస్ చెప్పినట్లుగానే గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీని ఖరారు చేస్తూ కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. అంతేకాకుండా కళాకారులకు, ఇతర రంగాలకు చెందిన వారికి కూడా ఈ సారి అవకాశంను ఇవ్వబోతున్నట్లులియో న్యూస్ తన కథనాలలో ముందస్తుగానే పేర్కొన్నది.











