ఏపీ ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా ఎల్ఐసీ ప్రకటన!
60 సంవత్సరాలు దాటిన నిరుపేద మహిళలకు ఫించన్ ఇచ్చేందుకు ఆనాడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకమే ‘వైఎస్ఆర్ అభయహస్తం’. ఈ పథకంలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 27 అక్టోంబరు 2009న ఎల్ఐసీ తో ఒప్పందం కూదుర్చుకుంది. అవగాన ఒప్పందంలో భాగంగా.. ఎల్ఐసీ సంస్థకు ప్రభుత్వం ప్రజల తరుఫున ప్రీమియం కింద నగదు పే చేసింది. ఈ నిధి మొత్తం రూ.2,000 కోట్లు. ఈ నిధిని కూడా ఏపి ప్రభుత్వం లాగేసుకుంది. దీనిపై స్పందించిన ఎల్ఐసీ .. ఈ పథకం కిందా ఉన్న నిధిని ప్రభుత్వం విత్ డ్రా చేయడంతో మా ఒప్పందం రద్దయ్యిందని బహిరంగ ప్రకటన ద్వారా తెలిపింది. ప్రభుత్వంతో తమ సంస్థ చేసుకున్న ఒప్పందం నవంబర్ 3, 2021 తో రద్దయినట్లు ఎల్ఐసీ ప్రకటించింది.
పూర్తి గా చేతులెత్తేస్తూ బాధ్యత నుంచి తప్పకున్న ఎల్ఐసీ..!
ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రద్దుకావడంతో మాస్టర్ పాలసీ నెంబర్ 514888, అభయహస్తం పథకం కింద మా అన్ని కర్తవ్యాలు, బాధ్యతలు నుంచి వైదొలగాం .. ఇక మాకు ఆ పథకంతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది. లబ్ధిదారుల గత క్లైయిమ్ లు, పెండింగ్ లో ఉన్న క్లైయిమ్ లు, భవిష్యత్తులో క్లైయిమ్స్ అన్నింటికీ బాధ్యత గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థదే అని కూడా న్యూస్ పేపర్లో ఇచ్చిన ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొంది. తమ వద్దనున్న రూ.2 వేల కోట్ల నిధిని ప్రభుత్వం డ్రా చేసేసినందుకే తమ బడంబడిక రద్దు అయినట్లుగా ఎల్ఐసీ ప్రకటించింది. ఇంతకన్నా దైర్భగ్యం ఏమైనా ఉందా అని విమక్షలు మండిపడుతున్నాయి. ఆర్థికవేత్తలు మరోపక్క హెచ్చరిస్తున్నా.. జగన్ రెడ్డి ప్రభుత్వానికి దున్నపోతుమీద వాన పడిన చందంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- అప్పులు.. స్వయంకృత తప్పిదాలు!