రాజారెడ్డి రాజ్యాంగంలో ఇవన్నీ మామూలేనా?
ఏపీ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది, అందుకే పోలీసులు జిల్లాలు దాటి మరీ టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇతర జిల్లా పోలీసులు రావడంపై ఆయన స్పందించారు. తెలుగుదేశం నేతలు వాస్తవాలు మాట్లాడితే పోలీసులు కేసులు పెడుతున్నారని పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్త చేశారు. వైసీపీ బూతులు మీకు వినసొంపుగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడికి నోటీసులిచ్చేందుకు ఇతర జిల్లా పోలీసులు రావడంపై ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు ఇంటిలోపల నల్లజెర్ల సీఐ రఘు, తన సిబ్బందితో వచ్చి కూర్చుని టీడీపీ కార్యకర్తలతో వాగ్వివాదం చేసే వీడియోను లోకేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జిల్లాలు దాటి మరీ టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రత్యేకమని అని విమర్శించారు.
వైసీపీ బూతులకు నేరుగా ఊరి వేయాలి..
టీడీపీ చేసే విమర్శలకే నోటీసులు ఇస్తే.. నిత్యం వైసీపీ నేతలు మాట్లాడే అబద్ధాలకు, బూతులకు నేరుగా ఊరి వేయాలని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు, బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం పీకుతారు అని సవాల్ చేస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించరేం అని ప్రశ్నించారు. వారి పై చట్టప్రకారం మీరు చేయాల్సినవి చేస్తే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్లవుతారని చెప్పుకొచ్చార. కనీసం వేసుకున్న ఖాకీ గౌరవన్ని నిలబెట్టండని చెప్పారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Must Read:-పోలీసుల తీరు పై మండిపడ్డ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..