అధికారంలోకి రాకముందు నేతలు అనేక హామీలు ఇస్తారు. ఐతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై శ్రద్ధ పెట్టేది మాత్రం కొద్దిమంది మాత్రమే. ఆ అతికొద్ది మందిలో మంత్రి నారా లోకేష్ కూడా ఉంటారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. అధికారంలోకి వస్తే వాళ్ల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలోని అశోక్‌నగర్‌లోని నగరపాలక సంస్థ పంప్‌హౌస్ ప్రాంతంలో గత నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 150 మంది గూడెంకొట్టాల వాసులకు శాశ్వత ఇంటి పట్టాలు ఇప్పిస్తామని పాదయాత్రలో నారా లోకష్ హామీ ఇచ్చారు.
అశోక్‌నగర్‌లోని నగరపాలక సంస్థ ప్రాంతంలో నిరుపేదలు పూరిగుడిసెల్లో నివాసం ఉంటున్నారు. శాశ్వత ఇంటి పట్టాల కోసం దశాబ్ధాలుగా ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరిగారు. ఐతే ఏనాడూ వారి సమస్యను పట్టించుకోలేదు. ఐతే పాదయాత్ర సమయంలో ఇదే అంశాన్ని టీజీ భరత్ లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లోకేష్ సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే ఇళ్లపట్టాలు అందజేస్తామని చెప్పారు.
తాజాగా ఈ హామీని నిలబెట్టుకున్నారు లోకేష్. బుధవారం అశోక్‌నగర్‌లోని నగరపాలక సంస్థ పంప్‌హౌస్ ప్రాంతంలో ఉన్న గూడెం కొట్టాలలో కోట్ల విలువ చేసే ఎకరం స్థలంలో మంగళవారం 150 మందికి మంత్రి టీ.జీ.భరత్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో జీవో 30 అమల్లోకి వచ్చిందన్నారు. దీని ప్రకారం మొదటిసారిగా మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని, రెండోసారి కర్నూలులో ఇచ్చి రికార్డు సృష్టించామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని మరిచిపోకుండా నెరవేర్చడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పని తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు











