ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టిన తరుణంలో ఉన్మాది పాలన పై ఉక్కు పిడికిలి బిగించి అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చెయ్యడమే లక్ష్యంగా యువగళం పేరుతో నీతి, అవినీతి, ధర్మం, అధర్మం , సమర్ధత, అసమర్ధత, ఏది మంచి, ఏది చెడు అనే అంశాలు వివరించేందుకు సుదీర్ఘ పాదయాత్రకు సిద్ద మయ్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
రాష్ట్రంలో 100 నియోజకవర్గాల గుండా దాదాపు 400 రోజులు పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాదయాత్రలో జగన్ రెడ్డి పాలనలో పీడనకు గురి అయిన అన్నీ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొంటూ, సమస్యల పై గళమెత్తుతూ 27-1-2023 న చిత్తూరు జిల్లా కుప్పం నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర చెయ్యనున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు. కానీ ప్రజల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలిపెట్టడం అందరిని కలిసి వేస్తుంది. పగ, ప్రతీకారం, విద్వేషం, విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ ను అధోగతి పాలు చేశారు. ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారం ప్రజలకే శాపమైంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు తిరోగమన బాట పట్టాయి. దార్శనికత మచ్చుకైనా కనపడని వ్యక్తి ఏలుబడిలో వర్తమానమే కాదు భవిష్యత్ కూడా లేకుండా చేశారు. నవ్యాంధ్రాను నాశనం చేస్తున్నఅవినీతి, అరాచక, అనైతిక, అసమర్ధ పాలకుల పీచమణి చే మహోగ్ర శక్తిగా యువజనం కదం తొక్కాలి. కులాలు, మతాలు, కుట్రలు, కుతంత్రాలు, నిర్భందాలతో నలిగిపోతున్న రాష్ట్రాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు యువత ఉప్పెనై, కెరటమై ఎగిసిపడాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గుర్తించి యువత తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
రాష్ట్రానికి ఎటువంటి దురవస్థ దాపురించిందో, రాష్ట్రం, ప్రజలు ఎంత నష్టపోవాల్సి వచ్చిందో యువత గుర్తించాలి. ఆదర్శాలు నూరిపోసి యువతని బురిడి కొట్టించి అధికారం లోకి వచ్చి యువత భవితను అంధకారం చేసిన వాస్తవాన్ని తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యువతే కనిపిస్తున్నారు. వారిలో అత్యధికులు స్వయం ఉపాధికల్పన, ఉధ్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారే. అర్హులకు అధికారం దక్కితేనే యువతకు భవిష్యత్తు.అసమర్ధ పాలన యువత గౌరప్రద జీవనాన్ని నాశనం చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నా,యువత భవితను బలిపెడుతున్నా నా మతం, నా కులం గొడవలో కొట్టుకుపోతోంది నేటి యువత.రాష్ట్రానికి యువతే పెద్ద సంపద. అటువంటి యువత అనేక సమస్యలతో సతమతమౌతోంది. మాదకద్రవ్యాలు, మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. రాజకీయాలకు విద్యావంతులైన యువత దూరంగా ఉంటున్నారు. చైతన్యవంతమైన యువత నేడు రాజకీయాలలోకి రావాలి విలువలు పెంచాలి.
వెలుగుల బాట దిశగా లోకేశ్
నారా లోకేశ్ వెలుగుల బాట లో పయనిస్తున్న జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోకేశ్ లో ఎవరికి కనిపించని పోరాట పటిమ,మేధో సంపత్తి దాగి వున్నాయి.పరి పూర్ణ నాయకుడుగా పరిణామం చెందే దశవైపు అడుగులు వేస్తున్నారు. నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి విద్వంస, విద్వేష,అరాచక,ఫాసిష్టు పాలన పై వెన్ను చూపని పోరాటం చేస్తున్నారు.సమస్యల పైనా,హక్కుల కోసం పోరాడే తత్వంలో లోకేశ్ తనను,తాను లక్ష్య సాధకుడిగా నిరూపించుకొన్నారు. సమర్ధ తో,ధైర్యంతో,పారదర్శకతో ముందుకు సాగుతున్నారు.అవే లోకేశ్ రాజకీయ ప్రస్థానానికి ఉత్తమ కొలమానం కాగలవు. అధికారం పక్షనాయకులు తనపై ఎన్నితప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసినా సమర్ధ వంతంగా తిప్పికొడుతూ ప్రభుత్వానికి దీటుగా సమాదానం ఇస్తున్నారు.అధికారంతో ప్రమేయం లేకుండా ప్రజలకోసం ఏల్ల వేళలా కృషి చేసేవారే నిజమైన నాయకులు అవుతారు. సమాజపు అవసరాలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దు కొనే మనస్తతత్వమే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఎదురు దెబ్బలు పాఠాలుగా, సంక్షోభాన్ని సానుకూల అవకాశాలుగా మార్చుకొని నాలుగేళ్లుగా ఉన్మాది పాలన పై ఉక్కు పిడికిలి బిగించి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు లోకేష్.అపారమైన పట్టుదల ప్రదర్శిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు.
ప్రభుత్వ రౌడీయిజం,గుండాయిజానికి,బెదిరింపులకు,అణచివేతలకు దడిచేది లేదన్న తెగువను ప్రదర్శించారు.ప్రభుత్వ మోసపూరిత జాబ్ క్యాలెండర్ ఉపసంహరిచుకోవాలని,జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా 2.లక్షల 30 వేల ఉధ్యోగాలకు రీ నోటిపికేషన్ ఇవ్వాలని,ఉధ్యోగాల భర్తీ కోసం రొడ్డేక్కి ఆందోళన చేస్తున్న నిరుధ్యోగుల తరపున పోరాటం చేశారు. విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చెయ్యడం పైనా ఉధ్యోగులకు అండగా నిలిచారు.విశాఖ ఉక్కును అమ్మేది ఎవడు?కొనేది ఎవడు అని నిలదీశారు. భారీ వర్షాలకు,వరదలకు లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి సర్వం కోల్పోయి రైతులు రోధిస్తుంటే వరద ప్రాంతాల్లో పర్యటించి రైతులను ఓదార్చి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విదానం రద్దు చేసి రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించడం తో దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. భవన నిర్మాణ రంగ కార్మికుల తరపున పోరాటం చేసి వారికి అండగా నిలిచారు. అమరావతి రాజధానికి కి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచారు.
కార్యకర్తలకు భరోసా
సహజ వనరుల దోపిడిలో గనుల గజనీల్లా పెట్రెగి పోతున్న అధికార పార్టీ నాయకుల దోపిడీపై పోరాటం చేశారు. తెలుగు దేశం పార్టీ కార్య కర్తల పై,నాయకుల పై జరుగుతున్నదాడులు అక్రమ అరెష్టు ల పైనా ప్రభుత్వం సాగించిన దమన కాండ పై పోరాటం చేస్తూ కార్యకర్తలకు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు మహిళలుపై జరుగుతున్నఅఘాయిత్యాలు, దాడులు పైనా, అక్రమకేసులు, గృహానిర్భాంధాలు,రాజకీయ కుట్రలు,వ్యక్తి గత ఆస్తులు ద్వంసం, రౌడీయిజం,గుండాయిజం. బెదిరింపులు,మీడియా పై దాడులు,మానసిక దాడులు, కక్ష సాధింపులపైనా అవిశ్రాంత పోరాటం చేశారు. గత ప్రభుత్వంలో ఐటి మంత్రిగా లోకేష్ కాలికి బలపం కట్టుకొని వివిధ దేశాల్లో పర్యటించి ఐటి పరిశ్రమలు రాష్ట్రానికి రప్పించేందుకు శ్రమించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఐటి అభివృద్దికి చంద్రబాబు ఏ విధంగా బలమైన పునాదులు వేసారో, ఆవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్దికి లోకేష్ బలమైన పునాదులు వేసారు.విభజనకు ముందు ఏపీలో చిన్న,చిన్న ఐటి యూనిట్లు మాత్రమే ఉండేవి. కానీ పెద్ద ఐటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు తక్కువని అందరూ భావించారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి అభివృద్ది లేని చోట ఐటి పరిశ్రమలు ఏర్పాటు అయ్యేందుకు ఐటి మంత్రి లోకేశ్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
రాష్ట్రంలో యువత భవిష్యత్తు లక్ష్యాలకు ధీటుగా వారిని గుణాత్మకంగా తీర్చిదిద్ది పెద్దఎత్తున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అప్పటి ఐటి మంత్రి గా లోకేశ్ అవిరళ కృషి చేశారు. నేడు అధికారం అయోగ్యుల పాలబడి ఐటి అడ్రస్ లేకుండా పోయింది. కావునా రాష్ట్రాభివృద్దికి ప్రణాళికలు వేసే ఆలోచనా పరుడు రాష్ట్రానికి అత్యవసరం. అవినీతికి ప్రణాళికలు వేసి ప్రజాధనాన్ని లూటీ చేసే పాలకులను వదిలించుకొని తమ జీవితాలను బాగు చేసే పాలకులను యువత ఎన్నుకోవాలి. ఎంతో భాధ్యతతో వ్యవహరించాల్సిన సమయమిది.అధికారం కోసం యువతకి గంపేడు ఆశలు కల్పించి గద్దెనెక్కాక నిరుధ్యోగ యువతను దారుణంగా దగా చేశారు.అధికారం లోకి రాగానే మొట్ట మొదట చేసే పని ప్రభుత్వ ఉధ్యోగాల్లో కాళీ గా వున్న 2.30 లక్షల ఉధ్యోగాలు భర్తీ చేస్తానని,ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని యువతని బులిపించి అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు కావస్తున్నా ఎటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యకుండా యువతని వంచించారు. జగన్ రెడ్డి కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న కంపెనీలు తరిమేసి యువతకు ఉఫాధి దూరం చేశారు.
టీడీపీ హయాంలో యువతకు కార్పోరేషన్ల ద్వారా సబ్సీడీ, బ్యాంకు రుణాలు ఇస్తే వైసిపి ప్రభుత్వం వాటిని ఆపేశారు.సెంటర్ పర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 ఏప్రిల్ నాటికి 4.0 శాతం ఉన్ననిరుద్యోగిత రేటు నేడు 13 శాతానికి పెరగడం ప్రభుత్వం చేతకాని తనానికి అద్దం పడుతుంది.ఉద్యోగ, ఉపాధి కల్పన కేంద్రంగా ఉన్న అమరావతిని ఆపేసి 15 లక్షల ఉద్యోగాలకు గండి కొట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపాధికి ఊతం ఇఛ్చే విదేశీ విద్య, స్వయం ఉపాధి రుణాలు స్కిల్ డెవలప్ మెంట్, ఎన్టీఆర్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న హామీకి కి తూట్లు పొడిచారు. యువతకి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు.తెలుగుదేశం హయాంలో ఐటీ అభివృద్దితో 36 వేల మందికి ఉద్యోగాలు,నైపుణ్యాభివృద్దితో 64 వేలమందికి ఉద్యోగావకాశాలు ఉద్యోగ కల్పన జరిగింది, నైపుణ్యాభివృద్ది శిక్షణలో దేశంలో మొదటి స్ధానంసాధించింది.గత ప్రభుత్వం ఐదేళ్లలో 2 సార్లు డీఎస్సీ నిర్వహించి 17591 ఉద్యోగాలిస్తే ప్రతి ఏటా డీఎస్సీ అన్న జగన్ రెడ్డి ఇంతవరకు కనీసం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. బ్యూరో ఆఫ్ పోలీసు రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (బిపిఆర్ డి) గణాంకాల ప్రకారం 2020 జనవరి 1నాటికి రాష్ట్రంలో 14,341 పోలీసు ఉద్యోగాలు ఖాళీలుంటే ఇంతవరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయ్యలేదు.
కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే దానిని ఎగ్గొట్టారు. రెగ్యులైజ్ చేయకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వారిని రోడ్డున పడేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే దానిని జగన్ రెడ్డి రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్లు, సబ్సిడితో బ్యాంకు రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేసి నిరుద్యోగుల పొట్టకొట్టారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక 2021 -22 లో 358 మంది నిరుద్యోగుల ఆత్మహత్య చేసుకున్నారు. పలువిభాగాల్లో కాళీగా వున్నఉద్యోగాల భర్తీకి కార్యాచరణ లేదు. నిరుద్యోగం పెరిగి ఆర్ధిక అసమానతలు పెరిగిపోతున్నాయి.ఉపాధి అవకాశాలు క్షీణించడం యువతలో అశాంతికి దారితీస్తుంది. యువత అసంతృప్తికి లోనయి అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం వుంది. ప్రత్యేక హోదా సాధించి ఉధ్యోగాల విప్లవం తెస్తానని యువతకు ఆశపెట్టారు జగన్.
అధికారంలోకి వచ్చాక హోదా పై పిల్లిమొగ్గలు వేసి తన కేసుల మాఫీకోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. అడుగడుగునా వంచించే ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు యువత వివేకవంతం కావాలి.యువతీ,యువకులు రాష్ట్రంలో నిర్దాయక శక్తులుగా ఎదిగి తమ భవిష్యత్ కి మేలు బాటలు వేసుకోవాలి.నిజానికి యువత చాలా శక్తిమంతమైనది. ఏ దేశ, రాష్ట్ర పురోగమనంలో నైనా యువతరానిదే కీలకపాత్ర. ఉత్తేజంలోనూ, ఉత్పత్తిలోనూ, ముందుండాల్సిన రాష్ట్రం మనది. దేశాభివృద్ది కానీ,రాష్ట్రాభివృద్ది కానీ సాధారణ,స్వార్ధ నాయకులతో సాధ్యం కాదు.వ్యక్తిత్వం,సమర్ధత, దార్శనికత,ప్రజా దృక్పదం గల గొప్ప నాయకుడు వల్లనే సాధ్యం.ప్రజలు తమకోసం పాటుపడే వారికి కాకుండా, అవినీతి పరులకు, అసమర్ధులకు,అవకాశ వాదులకు అధికారం ఇస్తే ఆ ప్రజలను ఇక బాగుచెయ్యడం ఎవరికి సాధ్యం కాదు. కావునా యువతరమే సమసమాజ నిర్మాణానికి సారథులై, నవ్యాంధ్రా నిర్మాణానికి వారధులై. రాష్ట్ర ప్రగతికి నిచ్చెన మెట్లవ్వాలి. ఆ దిశగా యువతరం ముందడుగు వెయ్యాలి.ఈ సందర్భంగా నారా లోకేష్ తలపెట్టిన 400 రోజులు,4 వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.